AP

ఏపీ మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్ల జాబితా విడుదల..!

ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్ల జాబితా విడుదలు చేసారు. దీంతో వివిధ జిల్లాలకు సంభందించిన రిజర్షన్లు ఈ క్రింది విధంగా కేటాయింయచారు. దీంతో మంగళగిరి (ఎస్టీ), కర్నూలు (ఎస్సీ మహిళ) రాజమండ్రి (ఎస్సీ జనరల్)కు కేటాయింపు చేశారు. బీసీలకు ఐదు స్థానాలు కేటాయింపు చేసి, బీసీ జనరల్ ఏలూరు, అనంతపురం, చిత్తూరు – బీసీ మహిళలకు కాకినాడ, మచిలీపట్నంకు జనరల్ మహిళలు విజయనగరం, శ్రీకాకుళం, గుంటూరు, కడప జిల్లాకు ఓపెన్ కేటగిరిలో తిరుపతి, విజయవాడ, ఒంగోలు, నెల్లూరు జిల్లాలు ఉన్నాయి.

తిరుపతి మేయర్ ఓపెన్ కేటగిరీ కి వచ్చే అవకాశం ఉన్నట్టు సమాచారం. దాదాపు ఓపెన్ కేటగిరీ రిజర్వేషన్ ఖరారైనట్టు అక్కడి అధికారులు అనుకుంటున్నారు. కూటమి ప్రభుత్వం నుండి బలిజ సామాజిక వర్గం నుండి ప్రణీత్, వెంకట కీర్తి, కిరణ్ రాయల్, సుభాషిణి పేర్లు పరిశీలనలో ఉన్నట్టు సమాచారం. బీసీలు నుండి యాదవ సామాజిక వర్గం నుండి అనిత యాదవ్, దంపూరి లావణ్య యాదవ్, పుష్పవతి యాదవ్ పేర్లు పరిశీలనలో ఉన్నాయి.

ఇక రెడ్డి సామాజిక వర్గం నుండి మబ్బు దేవనారాయణ రెడ్డి, ఇక బిజెపి పార్టీనుండి పరిశీలనలో పలు పేర్లున్నాయి. వీరిలో భానుప్రకాష్ రెడ్డి, నవీన్ కుమార్ రెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి. దీంతో పాటుగా ఇక ఓటమి అభ్యర్థిని బట్టి బరిలోకి దింపనున్న వైసిపి నేతలు అనుకుంటున్నారు. ఇక ఇప్పటికే మాజీ మేయర్ శిరీష తో పాటు, మరి కొంతమందిని సిద్ధం చేసినట్టు అక్కడి అధికారుల సమాచారం.