హైటెక్స్ వేదికగా సమాఖ్య-2026 గ్లోబల్ బిజినెస్ మీట్ ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. తొలి ప్రధాని జవహార్లాల్ నెహ్రూ. తీసుకున్న నిర్ణయాలు దేశాభివృద్దికి బాటలు వేశాయన్నారు. పీవీ నరసింహారావు, మన్మోహాన్ సింగ్ చేపట్టిన సంస్కరణలు భారత్ను ఆర్ధికంగా ప్రపంచంలో మేటీ దేశంగా నిలిపాయన్నారు. కేంద్ర-రాష్ట్రాల సమాఖ్య స్పూర్తితోనే వికసత్ భారత్ లక్ష్యం సాకారమవుతుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి.
ఏ దేశమైనా సరే యువత,మహిళ భాగస్వామ్యంతోనే ఆర్ధికంగా బలోపేతమవుతుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి జనాభా శాతాన్ని మించి తెలంగాణ దేశ జీడీపికి తన వాటాను అందిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. 2047 నాటికి త్రీ ట్రిలియన్ డాలర్ ఎనామినీ గ్రోత్ ను సాధించాలన్నది తమ లక్ష్యమన్నారు. రైజింగ్ తెలంగాణలో భాగస్వామ్యులు కావాలని పెట్టుబడి దారులకు పిలుపునిచ్చారు. మంచి పాలసీలను ప్రభుత్వం ఎప్పుడూ ప్రోత్సహిస్తుందని భరోసానిచ్చారు సీఎం రేవంత్ రెడ్డి.. అమెరికా,బ్రిటన్, అరబ్ , యూరప్ దేశాల ప్రతినిధులు గ్లోబల్ బిజినెస్ సమ్మిట్లో పాల్గొన్నారు.

