TELANGANA

సీఎం రేవంత్ అత్యవసర కేబినెట్ భేటీ.. ఎల్ నినోతో నష్టపోయిన రైతులకు పరిహరం..!

రాష్ట్రంలోని ఎల్ నినో అంశంపై చర్చించేందుకు సెక్రటేరియట్‌కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేరుకున్నారు. దీంతో అందుబాటులో ఉన్న మంత్రులతో సమావేశం సీఎం రేవంత్ సమావేశం ఎర్పాటు చేశారు. ఎల్‌నినో పరిస్థితులు, భవిష్యత్తు కార్యాచరణపై చర్చించారు. సచివాలయాకి చేరుకున్న సిఎం, పలువురు మంత్రులు హజరయ్యారు.

సీఎం, మంత్రులందరూ కలిసి అనధికారిక కేబినెట్ సమావేశం ఎర్పాటు చేశారు. ఎల్ నినోపై చర్చించారు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో ఎలినినో పరిస్తితితులపై నివేదికను సీఎం కి అధికారులు సమర్పించారు. సమావేశం అనంతరం సిఎం ప్రెస్ మీట్ లో మాట్లాడనున్నారు. ఈ సమావేశంలో క్యాబినెట్ తీసుకున్న నిర్ణయాలపై సీఎం రేవంత్ వెల్లడించనున్నట్టు సమాచారం. ఈ సమావేశంలో రైతులకు సీఎం గుడ్ న్యూస్ చెప్పనున్నారు. పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు 10వేలు పంటనష్టం ప్రకటించే అవకాశం ఉన్నట్టు అక్కడి అధికారుల తెలిపారు. దీంతో రాష్ట్రంలోని 320 మండలాలో కరువు, 117మండలాల్లో తీవ్రమైన కరువు అని సీఎం రేవంత్ రెడ్డికి అధికారుల నివేదికలు సమర్పించారు.

ఈ సమావేశంలో రేపు అఖిలపక్షం సమావేశం నిర్వహించాలని సిఎం రేవంత్ రెడ్డి తీర్మానం చేశారు. దీంతో డిల్లీకి అఖిలపక్షం తీసుకెళ్లే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు సమాచారం. ఎల్ నినో ఎఫెక్ట్ కారణంగా రాష్ట్లోని కరువును తగ్గించడం కోసం కేంద్ర ప్రభుత్వాన్ని తక్షన సహయం కింద 20వేల కోట్లు కోరనున్నటక్టు రాష్ట్ర ప్రభుత్వం పేర్కోంది.