AP

ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితిపై.. వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు..!

ఏపీ ఆర్థిక పరిస్థితిపై జగన్‌ సంచలన వ్యాఖ్యలు చేసారు. చంద్రబాబు అభివృద్ధి ప్రచారంపై జగన్‌ విమర్శలు గుప్పించారు. ఏపీలో విద్యుత్‌ డిమాండ్‌ తగ్గుతోందని వైఏస్ జగన్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. 2023-24లో 71,722 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ అమ్మకాలు జరిగాయని.. 2025-26లో 70,885 మిలియన్ యూనిట్లకు విద్యుత్‌‌ అమ్మకాలు తగ్గాయని అన్నారు.

విద్యుత్‌ డిస్పాచ్‌ 79,758 నుంచి 78,546 మిలియన్ యూనిట్లకు తగ్గిందని రాష్ట్ర సొంత పన్నుల ఆదాయంలో స్వల్ప వృద్ధే ఉందని విమర్శలు చేసారు. 2023-24లో రూ.85,922 కోట్లుగా రాష్ట్ర పన్నుల ఆదాయం ఉండేదని 2025-26లో రూ.86,552 కోట్లకు చేరిన పన్నుల ఆదాయం ఉందని అన్నారు.

ఆర్థిక మందగమనంతో పెట్టుబడులు, వినియోగం తగ్గాయని జగన్‌ ఆరోపణలు చేశారు. నిరుద్యోగంలో ఏపీ దేశంలో నాలుగో స్థానం నుంచి మూడో స్థానానికి పడిపొయిందని 23 లక్షల ఉద్యోగాల కల్పనపై చంద్రబాబును జగన్‌ ప్రశ్నించారు. ప్రభుత్వ అభివృద్ధి వాదనకు గణాంకాలే సవాల్‌ అంటూ వైసీపీ అధినేత జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.