TELANGANA

ఆర్టీసీ క్రాస్ రోడ్స్ వద్ద తీవ్ర ఉద్రిక్తత.. కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మధ్య దాడి..!

హైదరాబాద్‌లోని RTC క్రాస్ రోడ్స్ బావార్చి హోటల్లో వద్ద ఉద్రిక్తత పరిస్థితి నెకొంది. బావర్చీ వద్ద కాంగ్రెస్ వర్సెస్ బీఆరెస్ నేతల మద్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఇక వివరాల్లోకి వెలితే.. అయితే రాహుల్ గాంధీ బొమ్మతో బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ వ్యంగ్యంగా స్కిట్ ప్రదర్శించాడు. దీంతో ఈ సంఘటన తీవ్రకలకం రేపింది.

మన్నెక్రిశాంక్ రాహుల్ గాంధీకి బిర్యానీ తినిపిస్తూ సెటెరికల్‌గా స్కిట్ చేస్తున్నట్టు అక్కడి అధికారులు తెలిపారు. దీంతో బీఆర్ఎస్ కార్యకర్తలను అక్కడున్న కాంగ్రెస్ నాయకులు అడ్డుకున్నారు. కార్యకర్తలను అడ్డుకునే సమయంలో కాంగ్రెస్ కార్యకర్తలపై బీఆర్ఎస్ కార్యకర్తల దాడి చేసారు. దీంతో ఆగ్రహనికి గురైన కాంగ్రెస్ నాయకులు ప్రతిఘటించి ఎదురుదాడికి కాంగ్రెస్ నాయకులు దిగారు.

ఈ సంఘటనతో ఆర్టీసీ క్రాస్ రోడ్డు వద్ద ఉన్న బావర్చి హోటల్‌కు ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ చేరుకున్నారు. దీంతో హోటల్లో రాహుల్ గాంధీ బొమ్మతో స్కిట్ చేయడాన్ని తప్పుబట్టిన కాంగ్రెస్ నేతలు ఆగ్రహనికి గురయ్యారు. దీంతో ఓకరిపై ఓకరికి మాటా మాటా పెరిగి ప్రతిదాడులు జరిగినట్టు సమాచారం. ఈ దాడిలో ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, అరవింద్ యాదవ్ తన అనుచరులతో, బీఆర్ఎస్ నేతలు క్రిశాంత్, జైసింహ జగన్మోహన్ ‌పై దాడి జరిగినట్టు సమాచారం.