అమరావతి నిర్మాణాల్లో అవినీతిపై మాజీ సీఎం వైఎస్ జగన్ విమర్శలు చేశారు. అమరావతిలో నీ కలెక్షన్ రేటు.. నీ కరప్షన్ రేటు అదిరిందయ్యా చంద్రబాబు అంటూ ఎక్స్ లో జగన్ ట్వీట్ చేశారు. SFTకి రూ.30 వేలా? ఏంటి బాబూ బంగారంతో కడుతున్నావా? 2018లో కొత్త సచివాలయ భవనాల నిర్మాణ వ్యయం – రూ.2,271 కోట్లు.. 2024లో అధికారంలోకి రాగానే టెండర్ల రద్దు, భారీగా అవే బిల్డింగులకు అంచనాల పెంపు అని అన్నారు. 2025 ఏప్రిల్‌లో మళ్లీ అవే కంపెనీలకు, అవే పనులు అంటూ ఫైర్ అయ్యారు.
ఈసారి కాంట్రాక్టు విలువ ఏకంగా రూ.4,689 కోట్లకు పెంచారని, ఇప్పుడు మళ్లీ అవే పనులకు, మళ్లీ అంచనాల పెంపు. మొత్తం విలువ రూ.6,641 కోట్లు పెంచారని అన్నారు. దీనికి అదనంగా అద్దాలు, ఏసీలు సహా ఇతర పనులకు మరో రూ.4,830 కోట్లు పెంచారని, ఇప్పటికి ఆ 5 భవనాలు, 52.20 లక్షల SFT నిర్మాణ వ్యయం రూ.15,317 కోట్లు చేసారని అన్నారు. అంటే చంద్రబాబూ అమరావతిలో నీ స్పెషల్ రేటు.. SFTకి రూ.29,340 ఏంటి? ఏమైనా బంగారంతో కడుతున్నావా? అని ఫైర్ అయ్యారు. పైగా ఇసుక ఫ్రీ, కరెంటు ఛార్జీల్లో రాయితీలు, సీనరేజ్, NAC ఛార్జీల మినహాయింపు ఇచ్చారని అన్నారు.
కడుతున్నది ఉద్యోగులు పనిచేసే భవనాలే కదా బాబూ? బెంగళూరు, హైదరాబాద్, చెన్నై లాంటి మెట్రో నగరాల్లో సైతం ఫైవ్‌స్టార్ సదుపాయాలతో కూడా SFTకి రూ.5 వేలు మించి లేదని, మరి చంద్రబాబు.. అమరావతిలో ఈ స్పెషల్ రేటు ఏంటి? అంతర్జాతీయ స్థాయిలో నిర్మాణాలా? లేక ఇంటర్నేషనల్ స్థాయి అవినీతా? ప్రజల నెత్తిన అప్పులు మీ వాళ్లకు భారీ కాంట్రాక్టులంటూ ఫైర్ అయ్యారు. మీకేమో ముడుపులు. ఇది అమరావతిలో జరుగుతున్న మాయ.. అదిరిందయ్యా చంద్రబాబూ నీ లూటీ తంత్రం అంటూ జగన్ సెటైర్లు వేసారు.

