తెలుగుదేశం అధినేత చంద్రబాబుకు కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. సంచలనం కలిగించిన చంద్రబాబు స్కిల్ స్కాం కేసులో కోర్టు కీలక తీర్పు ఇచ్చింది.
22వ తేదీ వరకు రిమాండ్ విధిస్తూ తీర్పు వెలువరించింది. దీంతో, చంద్రబాబును రాజమండ్రి జైలుకు తరలించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. శనివారం ఉదయం నంద్యాలలో చంద్రబాబు అరెస్ట్ నుంచి కోర్టులో హోరా హోరీ వాదనల వరకు కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ ఉదయం కోర్టులో చంద్రబాబును ప్రవేశ పెట్టిన తరువాత వాదనలు దాదాపు ఏడు గంటల సేపు సాగాయి. చంద్రబాబును రిమాండ్ కు అనుమతి ఇవ్వాలని సీఐడీ కోరగా…చంద్రబాబు తరపున సిద్దార్ధ లూధ్రా వాదనలు వినిపించారు.