AP

తొలిసారి జగన్ పాలన పై వైఎస్ షర్మిల సంచలన కామెంట్స్…

వైయస్సార్ టిపి అధ్యక్షురాలు షర్మిల కాంగ్రెస్ తో ఎలా పొత్తు పెట్టుకుంటారు? ఆ పార్టీకి మద్దతు ఎలా ఇస్తారు? అంటూ వైసీపీ శ్రేణులు షర్మిలను ప్రశ్నిస్తున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలో వైసిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, సీఎం జగన్ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి షర్మిల మద్దతు ఇవ్వడం ఆమె పార్టీ పరంగా తీసుకున్న నిర్ణయం అంటూనే కొన్ని రకాల వ్యాఖ్యలు చేశారు. వైయస్ కుటుంబాన్ని కాంగ్రెస్ అధినాయకత్వం ఇబ్బంది పెట్టిందన్న విషయం అందరికీ తెలుసు అని గుర్తు చేశారు. నాడు సోనియా దగ్గరికి వెళ్లినప్పుడు వైయస్ జగన్ తో పాటు షర్మిల కూడా ఉన్నారని చెప్పుకొచ్చారు.

 

ఇటువంటి పరిస్థితుల్లో తాజాగా షర్మిల విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఏకంగా సజ్జల రామకృష్ణారెడ్డిని ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలు మాకు వైయస్సార్ తెలంగాణ పార్టీతో సంబంధం లేదన్న సజ్జల.. ఇప్పుడు ఏ సంబంధంతో మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. మాతో సంబంధం గురించి సజ్జలే సమాధానం చెప్పాలి. ఏపీలో రోడ్లు, విద్యుత్ పై తెలంగాణ సీఎం కేసీఆర్ బాహటంగానే విమర్శించారు. ఆయన వ్యాఖ్యలపై సజ్జలు ఏం చెబుతారు అంటూ షర్మిల తీవ్రస్థాయిలో వ్యాఖ్యానించారు. ముందు మీ కథ మీరు చూసుకోండి అంటూ హితవు పలికారు. తాను తెలంగాణ ప్రజల కోసమే ఎన్నికల్లో పాల్గొనలేదని… ఎవరూ తమకు కిరీటాలు పెట్టాలని కోరుకోవడం లేదని తేల్చి చెప్పారు. దీంతో ఇది షర్మిల, వైసిపి మధ్య గొడవగా మారింది.

 

వాస్తవానికి తెలంగాణ రాజకీయాలకు వైసిపి దూరంగా ఉంది. పూర్తిగా ఏపీకే పరిమితమైంది. అయితే సమయానుకూలంగా అక్కడి వ్యవహారాలపై నేతలు మాత్రం స్పందిస్తుంటారు. ఏపీ ఇబ్బందులపై తెలంగాణ నేతలు స్పందిస్తే.. వెంటనే దానికి కౌంటర్లు ఇస్తుంటారు. కానీ తెలంగాణ ఎన్నికల సమయంలో వైసిపి అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటుంది. అటు బిజెపి, ఇటు బి ఆర్ ఎస్ తో సన్నిహిత సంబంధాలు ఉండడంతో బాహటంగా ఎటువంటి వ్యాఖ్యానాలు చేయలేదు. ఇటువంటి సమయంలో షర్మిల ఏకంగా కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలపడం వైసిపి జీర్ణించుకోలేకపోతోంది. ఈ తరుణంలోనే సజ్జల మాట్లాడి షర్మిల కు టార్గెట్ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఏపీలో అభివృద్ధి లేదనే విమర్శలను సమర్థించేలా సజ్జలను టార్గెట్ చేసుకుని షర్మిల మాట్లాడడం విశేషం.