ఆగ్నేయ బంగాళాఖాతంలో ఈ నెల 14 నాటికి అల్పపీడనం ఏర్పడే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం అంచనా వేస్తోంది. ఆ తర్వాత ఇది పశ్చిమ-వాయవ్య దిశగా కదులుతుందన్నారు. దక్షిణ బంగాళాఖాతంలో ఈ నెల 16 నాటికి వాయుగుండంగా బలపడనుందని పేర్కొన్నారు. దీని ప్రభావంతో సోమవారం దక్షిణ కోస్తా, రాయలసీమలోని ఒకటి, రెండు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశముందని తెలిపారు.