ఏపీలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. ఆయన కదలికపైనే అన్ని రాజకీయ పక్షాలు ఫోకస్ పెంచాయి.ఇప్పటికే ఆయన తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్నారు. బిజెపి వస్తుందని ఎదురుచూస్తున్నారు. కానీ కేంద్ర పెద్దల నుంచి ఎటువంటి కదలిక లేదు. బిజెపి చర్యలను బట్టి కాంగ్రెస్ తో పాటు వామపక్షాలు ఒక నిర్ణయానికి రానున్నాయి. అయితే బిజెపి వస్తుందా? లేదా? అన్న విషయం తెలియడం లేదు. పవన్ చివరిసారిగా బిజెపి కోసం ప్రయత్నిస్తారని ప్రచారం జరుగుతోంది. పవన్ అనుసరించే విధానం పైనే ఏపీ రాజకీయ సమీకరణలు మారే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
More
From Ap politics
వైసీపీ అయితే ఒంటరి పోరుకు సిద్ధపడింది. రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున అభ్యర్థులను మార్చడానికి కసరత్తు చేస్తోంది. ఇప్పటికే 11 మంది అభ్యర్థులను మార్చింది. ఆ జాబితా 80 వరకు ఉండవచ్చని సంకేతాలు ఇస్తోంది. దీంతో టీడీపీ, జనసేన కూటమి సైతం ఎన్నికలకు సిద్ధపడాలని నిర్ణయించుకున్నాయి. ఇటీవల పవన్ ఇంటికి వెళ్లిన చంద్రబాబు కీలక చర్చలు జరిపారు. అయితే అందులో సీట్ల సర్దుబాటును పక్కన పెడితే బిజెపి విషయం ఏంటన్నది ఇరువురు నేతలు చర్చించుకున్నారు. చివరి అవకాశంగా బిజెపి కోసం ప్రయత్నిద్దామని.. రాకుంటే ప్రత్యామ్నాయం వైపు చూద్దామని డిసైడ్ అయినట్లు సమాచారం. ఈ నెలాఖరులోగా బిజెపి విషయం తేల్చేయాలని భావిస్తున్నారు. ఈ పనిని చంద్రబాబు పవన్ కు అప్పగించినట్లు సమాచారం.
త్వరలో పవన్ ఢిల్లీ వెళ్లనున్నట్లు తెలుస్తోంది. బిజెపి పెద్దల మనసులో ఏముంది అన్నది తెలుసుకోనున్నట్లు సమాచారం. అయితే పవన్ ఢిల్లీ టూర్ పైనే ఇప్పుడు అన్ని రాజకీయ పక్షాలు దృష్టిపెట్టాయి. ఢిల్లీ నుంచి వచ్చే సంకేతాలను బట్టి ఏపీలో రాజకీయ పావులు కదిపేందుకు పార్టీలు వ్యూహరచన చేస్తున్నాయి. ఒకవేళ బిజెపి ఆ కూటమిలోకి రాకుంటే మాత్రం.. కాంగ్రెస్ పార్టీతో పాటు వామపక్షాలు సిద్ధపడే అవకాశం ఉంది. అయితే ఒంటరిగా వెళ్లేందుకు బిజెపి సిద్ధపడుతుందా? లేదా? అన్నది చూడాలి. బిజెపి కలిసి వెళ్లాలనుకుంటే జనసేన, ఆపై టిడిపి ఆప్షన్ గా ఉన్నాయి. వైసిపి తో కలిసి నడవదు.. అలాగని కాంగ్రెస్ తో పాటు వామపక్షాలతో బిజెపికి పొసగదు. అందుకే బిజెపి వ్యూహం ఏంటన్నది ఎవరికి అంతుపట్టడం లేదు. పవన్ మధ్యవర్తిత్వంతో ఈ

