AP

ఏపీలో మరో సంచలన సర్వే.. గెలుపు ఎవరిదంటే?

రాష్ట్ర వ్యాప్తంగా 175 సీట్లపై గత కొన్ని రోజులుగా తాము చేపట్టిన సర్వే ఫలితాలను చాణక్య స్ట్రాటజీ సంస్థ వెల్లడించింది. టిడిపి, జనసేన కూటమి ఏకంగా 115 నుంచి 128 సీట్లు గెలుచుకునే అవకాశం ఉన్నట్లు సర్వే తేల్చింది. అధికార వైసిపి కేవలం 42 నుంచి 55 సీట్లకే పరిమితం అవుతుందని స్పష్టం చేసింది. 18 సీట్లలో హోరాహోరీ ఫైట్ నడుస్తుందని తేల్చి చెప్పింది. అయితే నాలుగు నుంచి ఏడు సీట్లు ఇతరులకు దక్కే అవకాశం ఉందని తేల్చడం విశేషం. ఉమ్మడి జిల్లాల వారీగా ఈ సర్వే ఫలితాలను సదరు సంస్థ వెల్లడించింది.

 

ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో 10 సీట్లకు గాను టిడిపి, జనసేన కూటమి ఎనిమిది స్థానాల్లో గెలుపొందనుంది. వైసిపి రెండు స్థానాలకే పరిమితం కానుంది. విజయనగరం జిల్లాలో టిడిపి జనసేన కూటమికి నాలుగు, వైసీపీకి నాలుగు లభించే అవకాశం ఉంది. ఒక్క సీటులో మాత్రం హోరాహోరి పోరు నడవనుంది. విశాఖలో 15 సీట్లకు గాను టిడిపి జనసేన కూటమికి 11, వైసిపికి రెండు సీట్లు రానున్నాయి. మరో రెండింట ఫైట్ నడవనంది. తూర్పుగోదావరిలో 19 సీట్లకు గాను టిడిపి జనసేన కూటమికి 16, వైసిపికి రెండు,మరోచోట ఫైట్ నడవనుంది. పశ్చిమగోదావరి జిల్లాలో 15 సీట్లకు గాను టిడిపి జనసేన కూటమికి 12, వైసీపీకి రెండు, మరోచోట గట్టి పోటీ ఉండబోతుంది.

 

కృష్ణాజిల్లాలో 16 సీట్లకు గాను టిడిపి జనసేన కూటమికి 12, వైసీపీకి రెండు, మరో రెండు సీట్లలో గట్టి పోటీ ఉంటుంది. గుంటూరు జిల్లాలో 15 సీట్లకు గాను టిడిపి జనసేన కూటమికి 12, వైసిపికి రెండు. మరో రెండు సీట్లలో గట్టి పోటీ ఉంటుంది. ప్రకాశం జిల్లాలో 12 సీట్లకు గాను టిడిపి జనసేన కూటమికి ఎనిమిది, వైసిపికి మూడు, ఒకచోట గట్టి పోటీ ఉంటుంది. నెల్లూరు జిల్లాలో 10 సీట్లలో టిడిపి జనసేన కూటమికి ఆరు, వైసిపికి మూడు. ఓ సీటులో గట్టి పోటీ ఉండబోతుంది. కడప జిల్లాలో 10 సీట్లకు గాను టిడిపి జనసేన కూటమికి నాలుగు, వైసీపీకి నాలుగు, మరో రెండు సీట్లలో హోరాహోరీ ఫైట్ నడవనుంది.

 

కర్నూలు జిల్లాలో 14 సీట్లలో టిడిపి జనసేన కూటమికి ఐదు, వైసీపీకి ఏడు, మరో రెండు సీట్లలో హోరాహోరీ ఫైట్ ఉంటుంది. అనంతపురం జిల్లాలో 14 సీట్లకు గాను టిడిపి జనసేన కూటమికి 10, వైసిపికి మూడు, మరొక చోట గట్టి పోటీ ఉంటుంది. చిత్తూరు జిల్లాలో 14 సీట్లకు గాను టిడిపి జనసేన కూటమికి ఏడు, వైసీపీకి ఐదు, మరో రెండు చోట్ల గట్టి పోటీ ఉంటుంది. పార్టీల వారీగా ఓట్ల శాతం చూసుకుంటే టిడిపికి 43, వైసీపీకి 41, జనసేనకు 10, ఇతరులకు ఆరు శాతం లభించే అవకాశాలు ఉన్నాయి.