AP

టీడీపీ, జనసేనతో బీజేపీ పొత్తు.. కీలక పరిణామం.

ఏపీలో పొత్తుల అంశం కీలక మలుపులు తిరుగుతోంది. తెలుగుదేశం,జనసేన ఒక తాటి పైకి వచ్చాయి. కలిసి అభ్యర్థులను ప్రకటించాయి. టిడిపి 94, జనసేన ఐదు స్థానాల్లో అభ్యర్థులను ఖరారు చేశారు. ఈ నేపథ్యంలో బిజెపి వస్తుందా? రాదా? అన్నది ప్రశ్నార్ధకంగా మారింది. బిజెపి అగ్ర నాయకత్వం నుంచి ఎటువంటి స్పందన లేకుండా పోయింది. నెల రోజుల కిందట ఢిల్లీ వెళ్లి వెళ్లిన చంద్రబాబు బిజెపి అగ్రనేతలతో సమావేశం అయ్యారు. పొత్తులపై చర్చలు జరిపారు. బిజెపి చంద్రబాబుకు కీలక ప్రతిపాదనలు చేసింది. అటు తరువాత ఢిల్లీ నుంచి వచ్చిన చంద్రబాబు పొత్తులపై ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు. పవన్ మాత్రం సీట్ల సర్దుబాటు ప్రక్రియ జరుగుతోందని ప్రకటించారు. అయితే తొలి జాబితాను ప్రకటించడంతో బిజెపిపై అనుమానాలు ప్రారంభమయ్యాయి. అయితే తాజాగా బిజెపి నుంచి సానుకూల సంకేతాలు వచ్చినట్లు సమాచారం. మూడు పార్టీల నేతలు సంయుక్తంగా ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది.

 

More

From Ap politics

చంద్రబాబుతో బిజెపి అగ్ర నేతలు సమావేశం అయినప్పుడు ఒక ప్రతిపాదన వచ్చినట్లు సమాచారం. పది అసెంబ్లీ స్థానాలు, 6 పార్లమెంట్ స్థానాలు కేటాయించాలని బిజెపి డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. అయితే అన్ని సీట్లు ఇచ్చేందుకు చంద్రబాబు మొగ్గు చూపలేదు. అందుకే పొత్తులపై ఎక్కడా స్పందించలేదు. అయితే ఈ విషయంలో పవన్ ప్రత్యేక చొరవ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఏపీలో పొత్తు ప్రాధాన్యత అంశంపై పవన్ చర్చించడంతో బిజెపి అగ్రనేతలు మెత్తబడినట్లు తెలుస్తోంది. పొ

 

త్తుకు దాదాపు అంగీకారం తెలిపినట్లు సమాచారం. ఒకటి రెండు రోజుల్లో బిజెపి నేతలు ఈ విషయంపై ధ్రువీకరించే అవకాశం ఉంది.

 

అయితే మారిన పరిస్థితుల నేపథ్యంలో బిజెపికి ఐదు అసెంబ్లీ స్థానాలు, మూడు పార్లమెంట్ స్థానాలు ఇచ్చేందుకు చంద్రబాబు అంగీకారం తెలిపినట్లు సమాచారం. ఇప్పటికే టిడిపి, జనసేనలు కలిపి తొలి జాబితాను ప్రకటించాయి. మొత్తం 99 మంది అభ్యర్థులను ఖరారు చేశాయి. జనసేన ఐదుగురు అభ్యర్థులను ప్రకటించింది. పొత్తులో భాగంగా మిగతా 19 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది. ఇప్పుడు బిజెపి అంగీకారం తెలపడంతో.. ఐదు స్థానాలు బిజెపికి, 52 స్థానాలు టిడిపికి ఖరారు కానున్నాయి. అయితే ఎవరెవరు ఏయే స్థానాల్లో పోటీ చేయాలి అన్న దానిపై ఇప్పటికే ప్రాథమికంగా ఒక కసరత్తు పూర్తి చేసినట్లు సమాచారం. పొత్తుల అంశం ఒక కొలిక్కి రావడంతో మూడు పార్టీలకు చెందినఅగ్రశ్రేణి నేతలు మరో రెండు మూడు రోజుల్లో అధికారిక ప్రకటన చేయడానికి సిద్ధపడుతున్నట్లు తెలుస్తోంది.