ఏపీలో ఎన్నికల పోరు ఆసక్తి కరంగా మారుతోంది. మూడు పార్టీల కూటమి అధికారం దక్కించుకోవటమే లక్ష్యంగా అడుగులు వేస్తోంది. జగన్ ఎలాగైనా అధికారం నిలబెట్టుకోవటమే టార్గెట్ గా ముందుకు వెళ్తున్నారు. అటు పీసీసీ చీఫ్ షర్మిల సైతం జగన్ ను టార్గెట్ చేస్తున్నారు. ఈ సమయంలో పవన్ కల్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురం పైన అందరిలో ఆసక్తి నెలకొంది. ఈ నియోజకవర్గం పైన జగన్ ఫోకస్ చేసారు. కీలక నిర్ణయం తీసుకున్నారు.
పిఠాపురం సమరం జనసేనాని పవన్ కల్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారు. 2019 ఎన్నికల్లో పవన్ పోటీ చేసిన గాజువాక, భీమవరం నుంచి ఓడిపోయారు. దీంతో..ఈ సారి ఎలాగైనా పిఠాపురం నుంచి గెలవాలనేది పవన్ లక్ష్యంగా ఉంది. అక్కడ టీడీపీ ఇంఛార్జ్ వర్మ సహకారం కోరారు. పవన్ ను గెలిపిస్తామని వర్మ చెబుతున్నారు. వైసీపీ నుంచి వంగా గీత మూడు నెలల కాలంగా ప్రచారం చేస్తున్నారు. సిట్టింగ్ వైసీపీ ఎమ్మెల్యే దొరబాబు తొలుత సహకరించకపోవటంతో..సీఎం జగన్ మాట్లాడి ఎమ్మెల్సీ హామీ ఇచ్చారు. గీత గెలుపుకు సహకరించాలని సూచించారు. అయినా..క్షేత్ర స్థాయిలో వైసీపీ కేడర్ మధ్య సమన్వయ లేమి కనిపిస్తోంది. నియోజకర్గంలో రెండు వైపులా చేరికలు పెరుగుతున్నాయి.
పిఠాపురం కు జగన్ దీంతో, సీఎం జగన్ పిఠాపురం పైన ప్రత్యేకంగా ఫోకస్ చేసారు. అక్కడ ప్రచారానికి నిర్ణయించారు. ప్రత్యేకంగా భారీ సభకు సిద్దం అవుతున్నారు. బస్సు యాత్ర చేస్తున్న జగన్ ఎప్పటికప్పుడు నియోజకవర్గాల వారీగా పరిస్థితుల పైన ఆరా తీస్తున్నారు. వైసీపీ గోదావరి జిల్లాల ఇంఛార్జ్ వర్మ ఈ నెల 12న పిఠాపురం రానున్నారు. టీడీపీ, జనసేన నుంచి కొందరు నేతలు వైసీపీలో చేరందుకు మంత్రాంగం సిద్దం చేసినట్లు తెలుస్తోంది. మరో వైపు ముద్రగడ గ్రామాల వారీగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. గోదావరి జిల్లాలో సామాజిక సమీకరణాలు..సంక్షేమం అస్త్రంగా వైసీపీ ప్రజల మధ్యకు వెళ్తోంది. వంగా గీత 2009లో ప్రజారాజ్యం నుంచి పిఠాపురం లో గెలుపొందారు.
దూకుడుగా ప్రచారం కాకినాడ ఎంపీగా, అంతుకు ముందు రాజ్యసభ సభ్యురాలిగా, జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్ గా స్తానికంగా పట్టు ఉంది. పిఠాపురం పరిధిలోని మండలాల బాధ్యతలను పార్టీ ముఖ్య నేతలకు అప్పగించారు. ఇప్పుడు జగన్ నియోజకవర్గంలో ప్రచారం చేయటం ద్వారా కలిసి వస్తుందని పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు. దీంతో..కొత్త మేనిఫెస్టో పైన జగన్ కసరత్తు చేస్తున్నారు. మేనిఫెస్టోలని అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లటం తో పాటుగా ఎన్నికల ప్రచారం వేగవంతం చేసేలా ఈ నెల మూడో వారం నుంచి రోజుకు మూడు సభల్లో ప్రసంగించేలా జగన్ షెడ్యూల్ ఖరారవుతోంది. దీంతో.. ఈ నెల 18న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల తరువాత ఏపీ ఎన్నికల రాజకీయం కొత్త టర్న్ తీసుకొనే అకవాశం ఉంది.