AP

ప్రధానితో సమావేశంపై పవన్ కల్యాణ్ స్పందన..!

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఢిల్లీలో వరుస సమావేశాలతో బిజీబిజీగా గడిపారు. ప్రధాని నరేంద్ర మోదీని కూడా పవన్ కలిశారు. ప్రధానితో సమావేశంపై ఆయన సోషల్ మీడియాలో స్పందించారు. ఊపిరి సలపనంత బిజీ షెడ్యూల్ లోనూ ప్రధాని ఎంతో విలువైన సమయాన్ని తమ కోసం కేటాయించారని, అందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని వెల్లడించారు.

 

“ప్రధాని మోదీని నేను మొదటిసారిగా గాంధీనగర్ లో కలిశాను. అప్పటి నుంచి ఇప్పటివరకు కూడా ఆయనతో ప్రతి సమావేశం ఎంతో సుహృద్భావ వాతావరణంలో జరిగేది. ప్రతి సమావేశం తర్వాత కూడా ఆయన పట్ల ఆరాధనా భావం కలిగేది. దేశం పట్ల ఆయన ప్రేమ, నిబద్ధత నిజంగా స్ఫూర్తిదాయకం” అని పవన్ కల్యాణ్ వివరించారు.