AP

శ్రీవారి లడ్డూ కల్తీపై సీబీఐ సిట్ ఏం తేల్చేంది, సుప్రీంకోర్టుకు ప్రైమరీ రిపోర్టు..

తిరుమల శ్రీవారి లడ్డూలో కల్తీ జరిగిందా? సీబీఐ నేతృత్వంలో సిట్‌ దర్యాప్తు ఎంత వరకు వచ్చింది? ఇంతకీ ఏ డైయిరీలో కల్తీ జరిగింది? సుప్రీంకోర్టుకు సమర్పించిన ప్రాథమిక నివేదికలో ఏయే అంశాలున్నాయి? ఇవే ప్రశ్నలు ఇప్పుడు శ్రీవారి భక్తులను వెంటాడుతున్నాయి.

 

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాల్లో కల్తీ నెయ్యి వినియోగించినట్లు వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు స్పీడ్‌గా జరుగుతోంది. సీబీఐ నేతృత్వంలోని సిట్‌ బృందం ప్రాథమిక నివేదికను సుప్రీంకోర్టు బెంచ్‌కు సమర్పించినట్లు సమాచారం. ఆన్‌లైన్‌లో ద్వారా రిపోర్టును అందజేసినట్టు తెలుస్తోంది. ఇప్పటివరకు సేకరించిన ఆధారాలు, దర్యాప్తు వివరాలు అందులో పొందుపరిచినట్టు తెలుస్తోంది.

 

రిపోర్టు సమర్పించడానికి ముందు తిరుపతిలో మూడు రోజులు మకాం వేసింది సిట్ బృందం. నెయ్యి కల్తీ ఎక్కడ జరిగింది అనేదానిపై సమగ్రంగా నివేదించారట. సిట్ టీమ్‌లోని అధికారులు సర్వశ్రేష్ట త్రిపాఠీ, వీరేశ్ ప్రభు, మురళీ రాంబా, డాక్టర్ సత్యేన్ కుమార్‌లు శుక్రవారం తిరుపతిలోని సిట్ ఆఫీసుకు వచ్చారు.