AP

ఏపీకి భారీ వర్ష సూచన..!

బంగాళాఖాతంలో అల్పపీడనాలు నాన్‌స్టాప్‌గా వస్తూ ఉన్నాయి. ఇప్పటికే ఈ నెల 7న ఒక అల్పపీడనం ఏర్పడగా.. ఈరోజు లేదా రేపు మరో అల్పపీడనం ఏర్పడుతుంది. అయితే ఈ నెల 17న మరో అల్పపీడనం ఏర్పడుతుందని అధికారులు చెబుతున్నారు. అయితే ఈ వరుస అల్పపీడనాల కారణంగా కొన్ని జిల్లాల్లో నాన్‌స్టాప్‌గా వర్షాలు కురుస్తున్నాయి.

 

ప్రస్తుతం ఏర్పడే అల్పపీడనం రెండు రోజుల్లో మరింత బలపడి వాయుగుండంగా మారే అవకాశం కనిపిస్తోంది. బలపడిన తర్వాత తమిళనాడు వైపు వెళ్లే అవకాశం ఉందని చెబుతున్నారు వాతావరణశాఖ అధికారులు. ఇక ఈ నెల 17న మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందన్నారు. మూడు రోజుల వ్యవధిలో రెండు అల్పపీడనాలు ఏర్పడుతున్నాయి. వీటి ప్రభావంతో మంగళ, బుధవారాల్లో భారీ వర్షాలు కురవనున్నాయి. ముఖ్యంగా తమిళనాడుతో పాటు ఏపీలోని ఉమ్మడి ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు కురవనున్నాయి. వరుస అల్పపీడనాలతో భయాందోళనలో ఉన్నారు రైతులు. ఇప్పటికే పంట చేతికొచ్చింది. ఈ అకాల వర్షాల కారణంగా తీవ్రంగా నష్టపోతామని భయంలో ఉన్నారు రైతులు. వర్షాలు కురిస్తే పంట మునిగిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు అధికారులు.

 

ఈ వరుస అల్పపీడనాలు ఏర్పడేందుకు అనేక కారణాలు కనిపిస్తున్నాయి. ఈశాన్య రుతుపవనాలు చురుకుగా కదులుతుండటం, థాయ్‌లాండ్‌ పరిసరాల్లో పరిస్థితులు అనుకూలంగా ఉండటమే కారణమంటున్నారు. మొత్తంగా చూస్తే ఈ నెలాఖరు వరకు రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురవొచ్చని అంచనా వేస్తున్నారు. ఈ రోజు లేదా రేపు ఏర్పడే అల్పపీడనం తీరానికి దగ్గరగా వస్తే చలి తీవ్రత కొంత తగ్గుతుందని చెబుతున్నారు అధికారులు.

 

మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో చలి పులి చంపేస్తోంది. వారం రోజులు నుంచి సాధారణం కంటే కనిష్ఠ స్థాయికి ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. రోజురోజుకూ పెరుగుతోన్న ఉష్ణోగ్రతలతో జనాలు గజగజ వణికిపోతున్నారు. పొగమంచు ప్రభావం రోజురోజుకీ ఎక్కువవుతోంది. ఆదిలాబాద్, అల్లూరి జిల్లాల్లో కనిష్ట స్థాయికి ఉష్ణోగ్రతలు పడిపోయాయి. ఆదిలాబాద్, అల్లూరి జిల్లాల్లో కనిష్ట స్థాయికి ఉష్ణోగ్రతలు పడిపోయాయి. రెండు రాష్ట్రాల్లోనూ కనిష్ట ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల కంటే తక్కువగా నమోదయ్యాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వాసులను చలి వణికిస్తోంది. ఇటు అల్లూరి జిల్లా అరకులోయ సింగిల్ డిజిట్ కి టెంపరేచర్లు పడిపోయాయి.