AP

జనసేన ఆవిర్భావ వేడుకలపై కీలక నిర్ణయం..

జనసేన ఆవిర్భావ వేడుకలకు సంబంధించి ఆ పార్టీ కీలక ప్రకటన చేసింది. మార్చి 14న జనసేన ఆవిర్భావ వేడుకలు జరగనున్నాయి. ఈ వేడుకలను జనసేనాని పవన్ కల్యాణ్ నియోజకవర్గం పిఠాపురంలో నిర్వహించాలని జనసేన నిర్ణయించింది.

 

సార్వత్రిక ఎన్నికల్లో జనసేన 100 శాతం స్ట్రైక్ రేట్ తో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. కూటమి ప్రభుత్వ ఏర్పాటులో జనసేన కీలకపాత్రను పోషించింది. ఘన విజయం తర్వాత మొదటి ఆవిర్భావ సభ కావడంతో… సభకు భారీ ఏర్పాట్లు చేయనున్నారు. పవన్ కల్యాణ్ ప్రతిపాదన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు.