గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీకి ఏపీ హైకోర్టులో ఊహించని షాక్ తగిలింది. ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ ను న్యాయస్థానం కొట్టివేసింది. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ముందస్తు బెయిల్ కావాలని వంశీ పిటిషన్ వేశారు. ఆయన పిటిషన్ ను విచారించిన హైకోర్టు దానిని కొట్టివేసింది. కాగా, దళిత యువకుడు సత్యవర్ధన్ కిడ్నాప్, బెదిరింపుల కేసులో వంశీని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన విజయవాడ జిల్లా కారాగారంలో ఉన్నారు.
