ఏపీ అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టారు ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి పూర్తిస్థాయి బడ్జెట్ ఇది. మొత్తం రూ. 3.22 లక్షల కోట్లతో ఈ బడ్జెట్‌ను ప్రవేశ పెట్టారు. గత పాలకులు ప్రతి శాఖలో ఆర్థిక అరాచకం చేశారని చెప్పారు. ఈ విషయాన్ని నీతి ఆయోగ్ చెప్పిందని గుర్తు చేశారు. రాష్ట్ర రుణ సామర్థ్యం సున్నాకు చేరుకుంది.
అప్పు తీసుకునే శక్తి లేని ఏకైరా రాష్ట్రంగా ఏపీ మిగిలిందన్నారు ఆర్థిక మంత్రి. సీఎం మాటల స్ఫూర్తితో బడ్జెట్‌ను రూపొందించినట్టు వెల్లడించారు. 2014-19 మధ్య రాష్ట్రం రెండంకెల వృద్ధి సాధించిందన్నారు. సవాళ్లను అధిగమించడంలో సీఎం చంద్రబాబుకు ఆయనే సాటన్నారు. జీతాలు కూడా చెల్లించలేని స్థితిలో చంద్రబాబు పగ్గాలు చేపట్టారన్నారు.
2025 26 వార్షిక బడ్జెట్ లో కీలక అంశాలు.
-రూ.3.22 లక్షల కోట్లతో బడ్జెట్
-వ్యవసాయానికి రూ.48వేల కోట్లు
– రెవెన్యూ వ్యయం రూ.2,51,162 కోట్లు
– రెవెన్యూ లోటు రూ. 33,185 కోట్లు
– మూలధన వ్యయం అంచనా రూ.40,635 కోట్లు
– ద్రవ్య లోటు రూ.79,926 కోట్లుగా అంచనా
-జీఎస్‌డీపీలో రెవెన్యూ లోటు 1.82 శాతం అంచనా
-జీఎస్‌డీపీలో ద్రవ్యలోటు 4.38 శాతం అంచనా
-పాఠశాల విద్యాశాఖకు రూ. 31,805 కోట్లు
– నైపుణ్యాభివృద్ధి శాఖకు రూ. 1,228 కోట్లు
– బీసీ సంక్షేమం కోసం రూ. 47, 456 కోట్లు
-ఎస్సీల సంక్షేమానికి రూ. 20,281 కోట్లు
-ఎస్టీల సంక్షేమానికి రూ.8,159 కోట్లు
-అల్ప సంఖ్యాక వర్గాల కోసం రూ. 5,434 కోట్లు
– వైద్యరోగ్య శాఖకు రూ. 19,265 కోట్లు
-పంచాయితీరాజ్ గ్రామీణ అభివృద్ధికి రూ. 18,848 కోట్లు
-పురపాలక, పట్టణాభివృద్ధి శాఖకు రూ.13,862 కోట్లు
-ఇందన శాఖకు రూ 13,600 కోట్లు
-వ్యవసాయ శాఖకు రూ.11,636 కోట్లు
-సాంఘిక సంక్షేమానికి రూ. 10,909 కోట్లు
-ఆర్థికంగా వెనుకబడిన సంక్షేమానికి రూ. 10,619 కోట్లు
-పౌరసరఫరాల శాఖకు రూ.3,806 కోట్లు
– మహిళ శిశు సంక్షేమ, దివ్యాంగుల, వృద్ధుల సంక్షేమం రూ. 4,332 కోట్లు
-గృహ నిర్మాణ శాఖకు రూ. 6,318 కోట్లు
– జలవనరుల శాఖకు రూ.18,019 కోట్లు
– పరిశ్రమలు, వాణిజ్య శాఖకు రూ.3,156 కోట్లు
– ఇంధన శాఖకు రూ. 13,600 కోట్లు
– రోడ్లు, రహదారులు శాఖకు రూ. 8,785 కోట్లు
– యువజన పర్యాటక, సాంస్కృతిక శాఖ రూ. 469 కోట్లు
– తెలుగు భాష అభివృద్ధి-ప్రచారం కోసం రూ. 10 కోట్లు
-మద్యం, మాదక ద్రవ్యాల రహిత రాష్ట్రం కోసం నవోదయం 2.0 కార్యక్రమానికి రూ. 10 కోట్లు
– అన్నదాత సుఖీభవ కోసం రూ. 6,300 కోట్లు
– పోలవరం కోసం రూ. 6,705 కోట్లు
– జల్ జీవన్ మిషన్ కోసం రూ. 2800 కోట్లు
-తల్లికి వందనం కోసం రూ. 9,407 కోట్లు
-ఎన్టీఆర్ భరోసా పింఛన్లకు రూ. 27, 518 కోట్లు
-ఆర్టీజీఎస్ కోసం రూ.101 కోట్లు
-దీపం 2.0 పథకానికి రూ. 2,601 కోట్లు
-మత్య్సకార భరోసాకు రూ. 450 కోట్లు
-స్వచ్ఛాంధ్ర కోసం రూ. 820 కోట్లు
-డొక్క సీతమ్మ మధ్యాహ్న భోజనం పథకం రూ 3,486 కోట్లు
-ఆదరణ పథనాకికి రూ. 1000 కోట్లు
-పబ్లిక్-ప్రైవేటు భాగస్వామ్యం కోసం వినూత్న పథకం, 20శాతం వరకు వయబులిటీ గ్యాప్ ఫండింగ్ ఇచ్చేలా స్కీమ్
– పీపీపీ ప్రొత్సాహానికి కార్పస్ ఫండ్ ఏర్పాటు రూ. 2000 కోట్లు