అమరావతి రాజధానికి బ్రాండ్ అంబాసిడర్‌గా నియమితులైన వైద్య విద్యార్థిని అంబుల వైష్ణవి, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ని నేడు కలిశారు. అంబుల వైష్ణవి గతేడాది జూన్‌లో రాజధానికి రూ.25 లక్షలు, 2019కి ముందు పలుసార్లు కలిపి రూ.25 లక్షలను విరాళంగా అందించారు. వైష్ణవిని బ్రాండ్ అంబాసిడర్‌గా నియమిస్తూ సీఆర్డీయే ఉత్తర్వులు ఇచ్చింది. ఈ నేపథ్యంలో సీఎం ను వైష్ణవి సచివాలయంలో శుక్రవారం కలిశారు.
