AP

ఎమ్మెల్సీ ఎన్నికలు.. నామినేషన్ వేయనున్న నాగబాబు..

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు జనసేన నేత కొణిదెల నాగబాబు కాసేపట్లో నామినేషన్ వేయనున్నారు. నాగబాబు అభ్యర్థిత్వాన్ని ప్రతిపాదిస్తూ జనసేన పార్టీకి చెందిన 10 మంది ఎమ్మెల్యేలు గురువారం సాయంత్రం సంతకాలు చేశారు. నాదెండ్ల మనోహర్, పంచకర్ల రమేశ్ బాబు, పత్సమట్ల ధర్మరాజు, లోకం మాధవి, ఆరణి శ్రీనివాసులు, మండలి బుద్ధ ప్రసాద్, విజయ్ కుమార్, బత్తుల రామకృష్ణ, పంతం నానాజీ, ఆరవ శ్రీధర్ సంతకాలు చేశారు. నాగబాబు ఎమ్మెల్సీగా ఎన్నికైన తర్వాత ఆయనను మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయి.

 

నామినేషన్ల దాఖలుకు మార్చి 10వ తేదీ చివరి గడువు. ప్రభుత్వ సెలవురోజులు మినహా ఏ రోజైనా ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. మార్చి 11న ఉదయం 11 గంటలకు నామినేషన్ల పరిశీలన, మార్చి 13న మధ్యాహ్నం 3 గంటల్లోపు ఉపసంహరణకు అవకాశం ఉంటుంది.