ఆంధ్రప్రదేశ్‌కు జీవనాడి పోలవరం ప్రాజెక్ట్. దశాబ్దాలుగా పోలవరం ఎప్పటికి పూర్తవుతుందనేది ఓ ఆన్సర్ లేని క్వశ్చన్. త్వరలోనే ఆ ప్రశ్నకు గోదావరి అంత సమాధానం దొరకబోతోంది. మరో రెండేళ్లలోనే పోలవరం పూర్తి చేయాలని సంకల్పించింది ఏపీలోని కూటమి ప్రభుత్వం. ఈ క్రమంలో పోలవరం పనులు ఎంతవరకొచ్చాయ్? ఏయే పనులు.. ఏ దశలో ఉన్నాయ్? ఓవరాల్‌గా.. పోలవరం ప్రోగ్రెస్ ఏంటి? అనే దాని గురించి క్లియర్ కట్ గా తెలుసుకుందాం.
వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో పోలవరం ప్రాజెక్ట్ పట్టాలెక్కింది. అప్పుడు శంకుస్థాపనకే పరిమితమైంది. 2014లో ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. పోలవరం పనుల్లో వేగం పెరిగింది. ఇప్పుడు మళ్లీ తెలుగుదేశం సారథ్యంలోని కూటమి సర్కార్.. 2027 నాటికి ప్రాజెక్ట్ పూర్తి చేయాలని టార్గెట్‌గా పెట్టుకుంది. ప్రపంచంలో ఏ నదిపై డ్యామ్ కట్టాలన్నా.. దానికంటే ముందు కాఫర్ డ్యామ్ కట్టడం కంపల్సరీ. పోలవరం ప్రాజెక్టుకు ఆటంకాలు రావొద్దన్నా, పనులు వేగంగా కొనసాగాలన్నా.. ప్రధానమైనది కాఫర్ డ్యామే. మరి.. పోలవరం దగ్గర కాఫర్ డ్యామ్ ఎంత పటిష్టంగా ఉంది? ప్రాజెక్ట్ నిర్మాణంలో అది ఎంత కీలకమో ఇప్పుడు చూద్దాం.
ఒక్క కాఫర్ డ్యామ్ మాత్రమే కాదు. దానికి ఆనుకొని బట్రెస్ డ్యామ్‌ని కూడా నిర్మిస్తున్నారు. వరద నీటిని ఆపేందుకు కాఫర్ డ్యామ్ కట్టారు. మళ్లీ.. ఈ బట్రెస్ డ్యామ్ దేనికోసం? అసలు.. బట్రెస్ డ్యామ్ అంటే ఏమిటి? ఇది లేకపోతే.. కాఫర్ డ్యామ్ ఉన్నా ఉపయోగం లేదా? పోలవరంలో బట్రెస్ డ్యామ్ ఎంత ముఖ్యం? పోలవరం ప్రాజెక్టులో కాఫర్ డ్యామ్, బట్రెస్ డ్యామ్ కంటే ముఖ్యమైన మరో నిర్మాణమే డయాఫ్రం వాల్. గోదావరి అడుగున నిర్మించే ఈ డయాఫ్రం వాల్ పనులు ఎంతవరకొచ్చాయ్? భూగర్భంలో దానిని ఎలా నిర్మిస్తున్నారో చూద్దాం.
డయాఫ్రం వాల్ నిర్మాణంలో మరో కీలకమైన భాగం.. గైడ్ వాల్. ఎక్కడపడితే అక్కడ తవ్వేయకుండా.. సరైన చోట తవ్వేందుకు ఈ గైడ్ వాల్‌ని నిర్మిస్తారు. భూమిపై గైడ్ వాల్ సరిగా ఉంటేనే.. భూమి లోపల డయాఫ్రం వాల్ సరిగా ఉంటుంది. ఆ పనులు ఎలా సాగుతున్నాయో చూద్దాం. ఏపీ వరప్రదాయిని పోలవరం ప్రాజెక్టులో డయాఫ్రం వాలే అత్యంత కీలకం. డ్యామ్ స్థిరత్వం, వాటర్ మేనేజ్‌మెంట్‌కి సంబంధించి ఇదే ప్రధానమైన నిర్మాణం. దానికోసమే విదేశాల నుంచి ప్రత్యేకంగా తెప్పించిన యంత్రాలు, పరికరాలతో.. డయాఫ్రం వాల్ నిర్మిస్తున్నారు.భూగర్భంలో తొలచిన మట్టి, రాళ్లను.. వందల మీటర్ల లోతులో నుంచి ఎలా బయటకు తీస్తున్నారో చూస్తే.. ఆశ్చర్యపోవడం ఖాయం. దానికోసం.. ఎలాంటి యంత్రాన్ని ఉపయోగిస్తున్నారో ఇప్పుడు చూద్దాం.
భూమి లోపల పటిష్టంగా నిర్మించే డయాఫ్రం వాల్‌ని.. ప్రధాన డ్యామ్‌కి కలుపుతారు. ఆ డయాఫ్రం వాల్ మీదే.. ఎర్త్ కం రాక్ ఫిల్ డ్యామ్‌ని నిర్మిస్తారు. అంతకంటే ముందు.. శాండ్ వైబ్రేటింగ్ అనే కీలక ప్రక్రియని పూర్తి చేయాల్సి ఉంటుంది. పోలవరం ప్రాజెక్టులో ఉన్న మరో ప్రధానమైన ఆకర్షణ ఫిష్ ల్యాడర్. గోదావరికి వలనొచ్చే.. పులస చేపల కోసం ప్రపంచంలో ఏ ప్రాజెక్టులో లేని విధంగా.. ఫిష్ ల్యాడర్ నిర్మించారు. పులసులు ఎదురీదేందుకు అదెలా పనిచేస్తుందో ఇప్పుడు చూద్దాం. పోలవరం ప్రాజెక్టులో ప్రధానమైన డ్యామ్ పనులు ఎప్పుడో పూర్తయిపోయాయ్. డయాఫ్రం వాల్, ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ కూడా పూర్తయితే.. ఎన్ని టీఎంసీల నీటిని స్టోర్ చేయొచ్చో చూద్దాం.
పోలవరం ప్రాజెక్టు ఉన్న ప్రాంతంలో డ్యామ్ కట్టడం అంత ఆషామాషీ వ్యవహారం కాదు. గోదావరిపై ప్రాజెక్ట్ నిర్మాణం అసాధ్యమని తేల్చారు. అందువల్ల.. నది దిశను మార్చి ప్రాజెక్టును నిర్మించడంలో మరో ప్రత్యేకత. అచ్చం ఆ గోదావరిలాగే.. పోలవరం పనులు కూడా పరుగులు పెడుతున్నాయ్. ఏపీలో కూటమి ప్రభుత్వం కమిట్‌మెంట్, కేంద్రంలో ఎన్డీయే సర్కార్ సహకారంతో.. ప్రాజెక్ట్ పనులు శరవేగంగా సాగుతున్నాయ్. ఎలాంటి పరిస్థితులున్నా.. పోలవరం నిర్మాణ పనులు నిరాటంకంగా సాగుతున్నాయ్. ఎట్టి పరిస్థితుల్లో.. 2027 నాటికి పోలవరం ప్రాజెక్టు ద్వారా ఆంధ్రప్రదేశ్ రైతుల పంట పొలాలకు నీళ్లివ్వాలని ధృడ సంకల్పంతో ఉంది ఏపీ సర్కార్.