AP

అనంతపురం టీడీపీలో రచ్చ… ఎమ్మెల్యే Vs ప్రభాకర్ చౌదరి..

అనంతపురం టీడీపీలో విభేదాలు రచ్చకెక్కాయి. అనంతపురం టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ కు మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరికి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. తాజాగా దగ్గుపాటికి ప్రభాకర్ చౌదరి సవాల్ విసిరారు. దగ్గుపాటి నోరు అదుపులో పెట్టుకోవాలని వార్నింగ్ ఇచ్చారు. దమ్ముంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రావాలని… ఇద్దరం ఎన్నికల్లో పోటీ చేద్దామని… ఎవరికి ఎన్ని ఓట్లు వస్తాయో చూద్దామని సవాల్ విసిరారు. సమాధులు ఆక్రమించిన వాళ్లు, ఇతర పార్టీల నుంచి వచ్చిన వాళ్లు కూడా తనను పార్టీ నుంచి సస్సెండ్ చేయాలని అడిగినట్టు తెలిసిందని ఎమ్మెల్యేపై ఫైర్ అయ్యారు.