AP

అంగన్‌వాడీలకు 5G మొబైల్స్ పంపిణీ: టీచర్లు, పిల్లలకు కిట్లు అందజేసిన ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్

అంగన్వాడి టీచర్స్ కు 5g మొబైల్స్ ,మినీ టు మెయిన్ అప్గ్రేడ్ అయిన టీచర్స్ కు ప్రోసోడింగ్ లెటర్స్ అందజేసిన కదిరి శాసనసభ్యులు గౌ శ్రీ కందికుంట వెంకటప్రసాద్ గారు

కదిరి పట్టణం ఐసిడిఎస్ కార్యాలయం నందు అంగన్వాడి టీచర్స్ కు గతంలో ఇచ్చిన మొబైల్ ఫోన్లతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న అంగన్వాడీల సమస్యను దృష్టిలో ఉంచుకొని రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం నూతన 5జీ మొబైల్ ఫోన్లు సమకూర్చింది. దీంతో గురువారం కదిరి పట్టణంలోనీ అంగన్వాడీలకు కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ చేతుల మీదుగా నూతన మొబైల్ ఫోన్లను అలాగే అంగన్వాడి సెంటర్లకు వచ్చే పిల్లలకు ఫ్రీ స్కూల్ కిట్టును అందజేశారు. ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ సిడిపిఓ రాధిక , టిడిపి నాయకులు బహువుద్దీన్, సూపర్వైజర్లు తదితరులు పాల్గొన్నారు.