- సత్య సాయి జిల్లా కదిరి
- తనకల్లు మండలంలో ముత్యాల వాండ్లపల్లి లో జగన్ బర్త్ డే వేడుకల్లో నిండు గర్భిణీ సంధ్యారాణి గొంతు నులిమి కాలితో తన్నిన వైసీపీ కార్యకర్త అజయ్ అరెస్ట్
- గర్భిణీ మహిళ కడుపుపై కాలితో తన్నిన నిందితుడు అజయ్ దేవా ను కదిరి పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ నుండి రూరల్ పోలీస్ స్టేషన్ వరకు ఊరేగించిన పోలీసులు.
- భవిష్యత్తులో మరో మహిళపై ఇటువంటి దాడులకు మరొకరు పాల్పడకుండా ఉండేలా నిందితుడు అజయ్ దేవా ను కదిరి పట్టణం నడిబొడ్డున ఊరేగింపు చేసిన పోలీసులు.
- మహిళ గర్భంలోని శిశువును చంపాలని ఉద్దేశంతోనే వైసిపి కార్యకర్తలు దాడులు చేశారని తెలిపిన పోలీసులు
- టపాసులు పక్కకు వెళ్లి కాల్చుకోవాలని సూచించిన మహిళపై వైసీపీ కార్యకర్తలు అజయ్, అంజినప్పలు దాడి చేశారని తెలిపిన పోలీసులు
- అజయ్ దేవాను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించిన పోలీసులు
- మరో నిందితుడు అంజినప్ప పరార్
- నిందితునిపై పోలీసుల వ్యవహరించిన తీరు పట్ల సర్వత్ర హర్షం
శ్రీ సత్య సాయి జిల్లా తనకల్లు మండలం ముత్యాల వాండ్లపల్లిలో జగన్ బర్త్డే వేడుకల్లో టపాసులు పక్కకు వెళ్లి కాల్చుకోవాలని సూచించిన నిండు గర్భణీ సంధ్యారాణిపై వైసిపి కార్యకర్తలు అజయ్ దేవ విచక్షణ రహితంగా దాడి చేసి గొంతు నులిమి కడుపుపై కాలి తో తన్నిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది. ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా పరిగణించింది కదిరి పోలీసులు నిందితుని అరెస్టు చేసి తమదైన శైలిలో చర్యలు చేపట్టారు. గర్భని మహిళా కడుపుపై కాలితో తన్నిన నిందితుడు అజయ్ దేవాను కదిరి పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ నుండి రూరల్ పోలీస్ స్టేషన్ వరకు పోలీసులు ఊరేగించారు. భవిష్యత్తులో మరో మహిళాపై ఇటువంటి దాడులకు పాల్పడకుండా ఉండేలా చర్యలు చేపట్టారు.మహిళా గర్భంలోని శిశువును చంపాలని ఉద్దేశంతోనే వైసీపీ కార్యకర్తలు అజయ్, అంజినప్పలు దాడులు చేశారని పోలీసులు తెలిపారు. వైసిపి కార్యకర్త అజయ్ ను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించామని మరో నిందితుడు అంజనప్ప పరార్ లో ఉన్నారని కదిరి డిఎస్పి శివ నారాయణస్వామి తెలిపారు. నిందితుడు వైసీపీ కార్యకర్త పట్ల పోలీసులు వ్యవహరించిన తీరు పట్ల కదిరి పట్టణంలో ప్రజలు సర్వర్త్ర హర్షం వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పోలీసులు చేపట్టిన చర్యలను ప్రజలు అభినందిస్తున్నారు.
బైట్స్
శివ నారాయణస్వామి కదిరి డిఎస్పి.

