AP

విద్యుత్ అధికారుల నిర్లక్ష్యానికి బలి: ఎల్సీ (LC) తీసుకోకుండా స్తంభం ఎక్కించడంతో యువ కూలీ మృతి

శ్రీ సత్య సాయి జిల్లా కదిరి:-

విద్యుత్ కాంట్రాక్టర్ అధికారుల నిర్లక్ష్యంతో నిండు ప్రాణం బలైన ఘటన శ్రీ సత్యసాయి జిల్లా కదిరి రూరల్ మండలం పట్నం గ్రామంలో చోటుచేసుకుంది రాచు వారిపల్లి తాండాకి చెందిన యువకుడు సాయికుమార్ నాయక్ విద్యుత్ కాంట్రాక్టర్ వద్ద దినసరి కూలీగా పని చేస్తున్నాడు…

పట్నం గ్రామంలో ఎల్ సి తీసుకోకుండానే సాయికుమార్ నాయక్ ను స్తంభం ఎక్కించడం వల్ల ప్రమాదం జరిగి విద్యుదాఘాతంతో అక్కడికక్కడే మృతి చెందాడు విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం వల్లే యువకుడు మృతి చెందాడని బంధువులు, గ్రామస్తులు మృతదేహంతో హాస్పిటల్ ఎదుట రోడ్డుపై బైఠాయించి ధర్నా చేపట్టారు…

పోలీసులు ఘటన ప్రదేశానికి చేరుకొని న్యాయం చేస్తామన్న కుటుంబ సభ్యులు ఒప్పుకోకపోవడంతో ఉద్రికిత పరిస్థితులు నెలకొన్నాయి మృతికి కారుకులైన విద్యుత్ శాఖ ఏఈ శివతేజ తో పాటు సిబ్బంది కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు బాధిత కుటుంబానికి ప్రభుత్వం న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హామీ ఇవ్వడంతో కుటుంబ సభ్యులు ధర్నాను విరమించారు…