AP

కదిరి క్షేత్రంలో ముక్కోటి ఏకాదశి సంబరాలు: రేపు ఉత్తర ద్వారం గుండా శ్రీవారి దర్శనం

ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని అంగరంగ వైభవంగా ముస్తాబవుతున్న శ్రీమత్ ఖాద్రి లక్ష్మీ నరసింహ స్వామి క్షేత్రం

శ్రీ మత్ ఖాద్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఈ నెల 30.12.25 వ తేదీ మంగళవారం ఉదయం 3.30 నిమిషాల నుంచి శ్రీ వారు ఉత్తర ద్వారం గుండా భక్తులకు దర్శనం భాగ్యం కల్పిస్తారు.

శ్రీమత్ ఖాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానానికి విచ్చేయుచున్న భక్తాదులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ముఖ్యంగా గుడి తిరువీధులలో అపరిశుభ్రత లేకుండా శుభ్రంగా ఉంచాలని శానిటైజేషన్ ఎప్పటికప్పుడు పకడ్బందీగా శుభ్రంగా చేయాలని.

రాష్ట్ర నలుమూలల నుంచి విచ్చేయుచున్న భక్తులకు ఎటువంటి ఆటంకాలు ఇబ్బందులు లేకుండా స్వామివారి దర్శన భాగ్యం అయ్యే విధంగా చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశించిన కదిరి శాసనసభ్యులు గౌ శ్రీ కందికుంట వెంకటప్రసాద్ గారు.

కావున రాష్ట్ర వ్యాప్తంగా విచ్చేస్తున్న భక్తాదులు కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకొని ఆ ఖాద్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి కృపకు పాత్రులు అవ్వాలని కోరిన కదిరి శాసనసభ్యులు గౌ శ్రీ కందికుంట వెంకటప్రసాద్ గారు

అలాగే నిన్న పెద్ద ఎత్తున జరిగిన ఇజితిమ ఏర్పాట్లను ఉన్నత అధికారులు తగు జాగ్రత్తలు తీసుకొని పకడ్బందీగా ఎవ్వరికీ ఎటువంటి ఆటంకాలు లేకుండా ఇజితిమ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన ఉన్నత అధికారులకు, అభినందనలు తెలియజేయడం జరిగింది