బీహార్ రాష్ట్రంలో జరగని గొడవలు, తెలంగాణ, ఏపీలో మాత్రమే జరుగుతాయా? రాధాకృష్ణ గారు: బీఎస్పీ రాష్ట్ర కార్యదర్శి అంపావతిని గోవిందు.
———————————————
3.1.2026న శ్రీసత్యసాయి జిల్లా, కదిరిలో బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో బీఎస్పీ రాష్ట్ర కార్యదర్శి అంపావతిని గోవిందు గారి అధ్యక్షతన “క్రాంతి జ్యోతి, చదువుల తల్లి, భారతదేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రి బాయి పూలే (3.1.1831-10.3.1897) గారి196వ జయంతి” సందర్భంగా ఆమె చిత్ర పటానికి పూల మాల సమర్పించి ఘనంగా జయంతి వేడుకలను జరుపుకోవడం జరిగింది. ఈ సందర్భంలో బీఎస్పీ రాష్ట్ర కార్యదర్శి అంపావతిని గోవిందు గారు మాట్లాడుతూ 27.12.2025న ఏబీఎన్ ఆంధ్రజ్యోతి టివిలో వీక్ ఎండ్ కామెంట్ లో కొత్తపలుకు-ఆర్కే విశ్లేషణలో ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ గారు “తెలంగాణలో కుల గణన చేసిన రేవంత్ రెడ్డి బీసీల సంఖ్య ఇంత అని ప్రకటించారే గానీ బీసీలలో ఏ కులం వాళ్లు ఎంత మందో ఎక్కడా ప్రకటించలేదు. ఇది చాలా తెలివైన నిర్ణయం. కులాలవారిగా జనాభా లెక్కలు ప్రకటించి ఉంటే బీసీ కులాల మధ్య గొడవలు జరిగేవి” అన్నారు.
బీహార్ రాష్ట్రంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం కుల గణన చేసి బీసీ కులాల వారిగా జనాభా లెక్కలు ప్రకటించి ఉన్నారు. మరి ఆ రాష్ట్రంలో బీసీ కులాల మధ్య ఎటువంటి గొడవలు జరగలేదు. కాని కర్ణాటకలో కులాల వారిగా ప్రకటించడం వలన అక్కడి బీసీ కులాల మధ్య గొడవలు వచ్చినాయని అబూత కల్పనలు సృష్టిస్తున్నారు. ఇందుకు రాధాకృష్ణ గారు చెబుతున్న నిర్వచనం “బీసీలు అంటే ఎన్నో కులాల సమూహం. ఎవరికి వారు తమ కులం జనాభా ఎక్కువ అని భావిస్తుంటారు. ఈ కారణంగా కులాల వారిగా బీసీల జనాభా వివరాలు ప్రకటించకూడదని రేవంత్ రెడ్డి నిర్ణయించుకున్నారు” అని అంటున్నారు. ఇది కేవలం దుర్మార్గుడైన ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ గారి లాంటి అగ్రకుల మనస్తత్వంతో కూడిన అగ్రకుల మీడియా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే ఇట్లాంటి దుర్మార్గపు, నీచపు పోకడలను సృష్టిస్తున్నాయి. ఈ పోకడలను మానుకోవాలి. లేనివి ఉన్నట్లు – ఉన్నవి లేనట్లు సృష్టించడం దుర్మార్గం, నీచం.
నిజంగానే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారికి దమ్ము, ధైర్యం ఉండి బీసీ కులాల వారిగా జనాభా లెక్కలు తెలిపి ఉంటే, రెడ్ల జనాభా, ఓసీల జనాభా ఎంత ఉంది అనేది బయటపడి ఉండేది. అప్పుడు ఇంత కాలం హిందూ బీసీ, ముస్లిం బీసీలను ఈ కుల, మత, దోపిడీ, కబ్జా, దౌర్జన్యదారుల పార్టీలు మోసం చేస్తున్న విషయం బయటపడి ఉండేది. దుర్మార్గుడైన ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ గారి దురాలోచన కేవలం తెలంగాణలో రెడ్ల పాలన, ఆంధ్రప్రదేశ్ లో కమ్మ కుల పాలన ఉండాలన్నదే తప్ప, హిందూ బీసీ, ముస్లిం బీసీలకు జనాభా దామాషా ప్రకారం విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థల్లో, చట్టసభల్లో వారి వాటా వారికి శాశ్వితంగా దక్క కూడదనేదే వారి దుర్మార్గమైన ఆలోచన.
“తెలంగాణలో రేవంత్ రెడ్డి బీసీ రిజర్వేషన్లు పెంచాలనుకోవడం వల్ల రెడ్డి సామాజిక వర్గం కినుక వహించిందన్న ప్రచారం కొంత కాలంగా జరుగుతోందని” ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ గారు అంటున్నారు. దీని అర్ధం హిందూ బీసీ, ముస్లిం బీసీలకు దక్కాల్సిన వాటాను తెలంగాణలో రెడ్లు, ఓసీలు అక్రమంగా అక్రమించుకొంటున్నారనేది స్పష్టమౌతోంది కదా! ఈ విధంగానే ఆంధ్రప్రదేశ్ లో కూడా హిందూ బీసీ, ముస్లిం బీసీల వాటాను కమ్మ, రెడ్లు అక్రమించుకొంటున్నారనేది కూడా స్పష్టమౌతోంది.
మీరు చూడండి దుర్మార్గమైన, నీచమైన అగ్రకుల మీడియా రెండు రాష్ట్రాల్లోని ప్రజలకు ఏ విధంగాను అవసరం లేని “ఫిలిం చాంబర్” ఎన్నికలను గురించి మాత్రం పదే పదే టీవీల్లో చూపుతుంది, పత్రికలలో రాస్తుంది. కాని సాయి ఈశ్వరాచారి అనే బీసీ యువకుడు తనకు భార్య, ముగ్గురు చిన్న పిల్లలు ఉన్నప్పటికీ హైదరాబాద్ లో బీసీలకు విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తామన్న ఎన్నికల హామీని అమలు చేయట్లేదని, కనీసం నా చావుతోనైన బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించాలనే తలంపుతో తనకు తానుగా ఒంటి మీద పెట్రోల్ పోసుకొని నిప్పు అంటించుకొని ఆత్మహత్య చేసుకొంటే కనీసం ఒక టీవీ చానల్ కాని, ఒక పత్రిక కాని ప్రజల దృష్టికి తేలేదు. ఇంత దుర్మార్గమైన, ఇంత నీచమైన మీడియా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో తప్ప ప్రపంచంలో ఎక్కడైనా ఉందా? అని గట్టిగా సూటిగా ప్రశ్నిస్తున్నాం.
ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ గారు నిజంగా మీరు మనిషైతే స్వాతంత్ర్యం వచ్చిన 72 సం.ల తర్వాత తీసుకొచ్చిన ఈ.డబ్ల్యూ.ఎస్. మీద ఎందుకు ఇంతవరకు స్పందించలేదని డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఈ దేశంలో ఓసీల జనాభా ఎంత ఉన్నదో తెలియదు, ఓసీలు ఒక వినతి పత్రం ఇవ్వలేదు, కేంద్ర ప్రభుత్వం ఒక కమిటీ వేయలేదు, కనీసం సమగ్రమైన చర్చ జరపలేదు. కాని గౌరవ ప్రధానమంత్రి నరేంద్రమోదీ గారు మాత్రం పార్లమెంటులో103వ రాజ్యాంగ సవరణ బిల్లును ప్రవేశపెట్టి రెండు రోజుల్లో ఆమోదింపచేసుకొని ఈ.డబ్ల్యూ.ఎస్. పేరుతో 10 శాతం విద్య, ఉద్యోగాల్లో ఓసీలకు రిజర్వేషన్ కల్పించారు. వీటిని ఇప్పుడు అమలు చేస్తుంటే 54 మార్కులు వచ్చిన ఓసీ వ్యక్తికి ఉద్యోగం వచ్చింది. కాని 65 మార్కులు వచ్చిన బీసీ వ్యక్తికి ఉద్యోగం రాలేదు. అలాగే ఇటీవల తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో టీచర్ ఉద్యోగాలు భర్తీ చేస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల మార్కుల కంటే ఓసీల మార్కులు తక్కువ. దీని మీద అగ్రకుల మీడియా, దుర్మార్గుడైన ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ గారు ఇప్పటికైనా స్పందించాలని డిమాండ్ చేస్తున్నాం.
ఇందులో పాల్గొన్నవారు:- బహుజన నాయకులు కె.ఆర్.హరిప్రసాద్, బీసీ ఉద్యోగుల సంఘంలో పని చేసిన సీనియర్ నాయకులు & ఇటీవల స్కూలు అసిస్టెంట్ గా పని చేసి పదవి విరమణ పొందిన కనుముక్కల లక్ష్మన్న, బీఎస్పీ నల్లమాడ మండల అధ్యక్షులు రమణ, బీఎస్పీ నల్లమాడ మండల ప్రధాన కార్యదర్శి షేక్ మోదీన్ బాష, మోహన్ రాజ్, పఠాన్ మోదీన్ బాష, రాజు, గంగులప్ప, గాదలపురి నారాయణస్వామి, శ్రీరాములు, హరియదవ్, వెంకటసుబ్బయ్య, తిరుపాల్, సుధాకర్, తలారి వెంకటరమణ, సయ్యద్ వలి, నరసింహులు, శ్రీనివాసులు, కుల్లాయప్ప, వెంకటనారాయణ, నారాయణ తదితరులు

