శ్రీ సత్య సాయి జిల్లా కదిరి
తనకల్లు మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ ముందు ఈశ్వరప్ప అనే వ్యక్తిని హత్య చేసిన హరి అనే వ్యక్తి.
తెల్లవారి మూడు గంటల సమయంలో జరిగిన హత్య.ఈశ్వరప్ప పై కొడవలి తో నరికి దారుణంగా హత్య చేసిన హరి ఆయన సోదరుడు చిన్నప్ప.
హరి భార్య గత మూడు రోజులుగా కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసిన హరి.ఈ రోజు తెల్లవారి జామున మూడు గంటలకు హరి భార్యతో పాటు ఈశ్వరప్ప ను పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చిన పోలీసులు.
అప్పటికే ముందస్తుగా ప్లాన్ తో ఉన్న హరి పోలీస్ స్టేషన్ గేట్ ముందు తన అన్న చిన్నప్ప తో కలిసి కొడవలితో నరికి హత్య.
ఈశ్వరప్ప, హరి భార్య కు ఉన్న అక్రమ సంబంధమే హత్యకు దారి తీసినట్లు అనుమానిస్తున్న పోలీసులు.
పోలీస్ స్టేషన్ ముందే హత్య జరగడంతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ పోలీసులు.ఘటన స్థలికి చేరుకొని విచారణ చేస్తున్న డీఎస్పీ శివనారాయణ స్వామి.

