AP

మాతా శిశు మరణాల నివారణకు సమష్టిగా కృషి చేయాలి: జిల్లా వైద్యాధికారి డాక్ట‌ర్‌ కె. సురేష్ బాబు

మాతా శిశు మరణాలు తగ్గించండి….
జిల్లా వ్యాధి నిరోధక టీకాల అధికారి డాక్టర్ కే సురేష్ బాబు
నేడు పట్నం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు నిర్వహించుచున్న ఆశాడే సమావేశంలో పాల్గొన్న జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి సురేష్ బాబు గారు హాజరైనటువంటి ఆరోగ్య మరియు ఆశా కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ మాతా శిశు మరణాలకు కారణమైన చిన్న వయసు బాలికలకు వివాహాలు చేయుట
పౌష్టికాహార లోపం
వివాహం జరిగిన వెంటనే చిన్న వయసులోనే గర్భం
అవగాహన రాహిత్యం వైద్యాధికారి పరీక్షలకు హాజరు కాకుండా కుటుంబ సభ్యుల సహకారం లేకపోవుట తదితర సమస్యల దృష్ట్యా మాతృ మరణాలు మరియు శిశు మరణాలు ఎక్కువగా జరుగుతున్నందున వాటి నివారణకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టవలసినదిగా అందరికి సూచించారు
అదేవిధంగా అప్పుడు పుట్టిన బిడ్డ మొదలుకొని మొదట జన్మదినోత్సవం జరుపుకునే బిడ్డ వరకు అందరికీ అవసరమైన అన్ని వ్యాధి నిరోధక టీకాలు ఇవ్వవలసినదిగా సూచించారు కార్యక్రమంలో వైద్యాధికారి వినోద్ కుమార్ CHO లక్ష్మీదేవమ్మ, వన్నప్ప, సూపర్ వైజర్లు విజయ్ శేఖర్, పద్మజ ,ఆరోగ్య సిబ్బంది మరియు ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు