AP

కదిరిలో పోలీసుల భారీ ‘కార్డన్ సెర్చ్’: 150 మంది సిబ్బందితో నిజాం వలి కాలనీలో ఆకస్మిక తనిఖీలు!

శ్రీ సత్య సాయి జిల్లా కదిరి

  • కార్డెన్ సర్చ్…..
  • శ్రీ సత్య సాయి జిల్లా కదిరిలో భారీ గా పోలీస్ తనిఖీలు
  • ఉదయం 5 గంటల నుంచి నిజాం వలి కాలనీలో పోలీసుల సోదాలు
  • డీఎస్పీ కదిరి ఆధ్వర్యంలో 150 మంది పోలీసులతో ఆపరేషన్
  • పలువురి ఇళ్లలో సోదాలు నిర్వహించిన పోలీసులు
  • రికార్డులు లేని పలు వాహనాలు స్వాధీనం
  • గంజాయి కేసులపై ప్రత్యేక దృష్టి
    రౌడీ షీట్స్, సస్పెక్ట్ షీట్స్ తనిఖీ
  • చట్టవిరుద్ధ కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపుతున్న పోలీసుల

 

శ్రీ సత్య సాయి జిల్లా కదిరిలో పోలీసులు భారీ తనిఖీలు చేపట్టారు.ఈ రోజు ఉదయం 5 గంటల నుంచే కదిరి టౌన్‌లోని నిజాం వలి కాలనీలో
డీఎస్పీ కదిరి ఆధ్వర్యంలో దాదాపు 150 మంది పోలీసులతో,విస్తృత స్థాయిలో ఇల్లు సోదాలు నిర్వహించారు.
ఈ తనిఖీల్లో భాగంగా రికార్డులు లేని పలు వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.అలాగే గంజాయి కేసులు, రౌడీ షీట్స్, సస్పెక్ట్ షీట్స్‌కు సంబంధించి
సమగ్ర తనిఖీలు కొనసాగుతున్నాయి.
చట్టవిరుద్ధ కార్యకలాపాలకు చెక్ పెట్టడమే లక్ష్యంగా ఈ తనిఖీలు నిర్వహిస్తున్నామని పోలీసులు తెలిపారు.ప్రాంతంలో శాంతి భద్రతలు కాపాడేందుకు ఇలాంటి తనిఖీలు మరింత కఠినంగా కొనసాగుతాయని వెల్లడించారు.