AP

స్వాతి నక్షత్రం సందర్భంగా శ్రీ ఖాద్రీ లక్ష్మీ నారసింహ స్వామి వారి స్తోత్రాద్రికి పెద్దయెత్తున గిరి ప్రదక్షిణ చేసిన భక్తులకు.

నవనారసింహ క్షేత్రాలలో ప్రహ్లాద సమేతంగా స్వయంభువుగా వెలసిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ మత్ ఖాద్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి దేవస్థానం.శ్రీ స్వామి వారు కదిరి పట్టణానికి సమీప దూరంలో కొండల లక్ష్మీ నారసింహుడుగా స్తోత్రాద్రిపై మొదటగా పాదం మోపారని అందుకే ఈ క్షేత్రానికి “ఖాద్రీపురం” అనే పేరు వచ్చిందని ‘ఖ’ అనగా విష్ణుపాదం ‘అద్రి’ అనగా పర్వత. శ్రీ ఖాద్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారిని ప్రహ్లాద సమేతంగా దర్శించుకుంటే మోక్షం లభిస్తుందని ఖాద్రీ పురాణంలో పేర్కొనబడింది పండితులు,అర్చకులు తెలియజేస్తున్నారు. శ్రీ నరసింహ స్వామి వారు ఈ కేత్రంలో లక్ష్మీ నారసింహుడుగా ప్రహ్లాదుడు , సకల దేవతలు స్తోత్రం చెయ్యడం వల్ల వెలసారని అందుకే ఈ పర్వతం స్తోత్రాద్రిగా ప్రత్యేకతను సంతరించుకుంది. అటువంటి గొప్ప చారిత్రాత్మక ప్రాముఖ్యత కలిగిన స్తోత్రాద్రికి ( కదిరి కొండ ) శ్రీ వారి జన్మ నక్షత్రం స్వాతి నక్షత్రం సందర్భంగా శ్రీ మత్ ఖాద్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి ఆలయం వద్ద నుంచి పాదయాత్రగా బయలుదేరి కుమ్మరవాండ్ల పల్లి గ్రామంలో వెలసిన కొండల లక్ష్మీ నారసింహ స్తోత్రాద్రికి అర్చకులు ప్రత్యేక హారతి ఇచ్చిన అనంతరం పెద్దయెత్తున గిరిప్రదక్షిణలో గోవింద నామస్మరణతో హరినామ కీర్తనలతో , భజనలతో భక్తాదులు పాల్గొంటున్నారు.స్తోత్రాద్రి గిరిప్రదక్షిణకు విచ్చేస్తున్న భక్తాదుల సౌకర్యార్థం ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు , ఖాద్రీ లక్ష్మీ నృసింహ సేవా సమితి సభ్యులు మంచినీటి,మజ్జిగ ప్యాకెట్ల ,పట్టణ ప్రముఖులు శ్రీనివాసులు , రమేష్ రెడ్డి , వీర శేఖర్ , వెంకటేష్ తదితరులు భక్తులకు కదిరి కొండ వద్ద మహా ప్రసాదం (అల్పాహారం) సదుపాయం కల్పించారు.ఈ స్తోత్రాద్రి గిరిప్రదక్షిణలో మహిళలు,యువకులు,పిల్లలు, వృద్ధులు పెద్దఎత్తున పాల్గొంటున్నారు. ప్రతి నెలా స్వాతి నక్షత్రం సందర్భంగా అంచెలంచెలుగా పేరుతో దినదినాభివృద్ధి చెందుతున్న కారణంగా ఆలయ అధికారులు , ప్రభుత్వ అధికారులు కొంచెం ప్రత్యేక దృష్టి సారించి భక్తాదుల సౌకర్యార్థం కొండ చుట్టూ రహదారిని ఏర్పాటు చేస్తే చాలా బాగుంటుందని శ్రీ ఖాద్రీ లక్ష్మీ నృసింహ సేవా సమితి సభ్యులు మరియు హిందూ ధార్మిక సంస్థలు , శ్రీ వారి భక్తులు అభిప్రాయాన్ని వ్యక్త పరుస్తున్నారు.