AP

ఉపాధి హామీ పథకాన్ని నీరుగార్చొద్దు: కొత్త చట్టాన్ని వ్యతిరేకిస్తూ కదిరిలో సిఐటియు (CITU) నిరసన

  • గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని పునరుద్ధరించాలి, ఉపాధిని దెబ్బ కొట్టే కొత్త చట్టాన్ని వ్యతిరేకించండి !

    కదిరి మండలం మల్లయ్య గారి పల్లి గ్రామంలో సిఐటియు ఆధ్వర్యంలో ఉపాధి హామీ కూలీలతో మాట్లాడుతూ, కరపత్రాలను పంచడం జరిగింది

ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి సాంబా శివ, కదిరి పట్టణ కార్యదర్శి బాబ్ జాన్ మాట్లాడుతూ2005సం.లో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని వామపక్ష పార్టీల కృషితోనే కేంద్ర ప్రభుత్వం, ఈ పథకం అమలు చేయడం జరిగిందన్నారు.

ఈ పథకంలోఅత్యధిక మంది కూలీలు, పేద రైతులు, దళితులు, గిరిజనులు, అట్టడుగు వర్గాల పేదలు, వెనుకబడిన కులాల వారు, మైనార్టీలు, అగ్రకులాలకు చెందిన పేదలకు, ఈ పథకం ద్వారా లబ్ది చేకూరుతుందని, ఈ పథకంలో మహిళలకు సమాన పనికి సమాన వేతనం అమలవుతుందన్నారు.
ఇలాంటి పథకాన్ని కేంద్ర ప్రభుత్వం నీరుగార్చే విధంగా చట్టాలు చేయడాన్ని సిఐటియు గా తీవ్రంగాఖండిస్తున్నామన్నారు. కార్పొరేట్ల ఒత్తిడితోనే కొత్త చట్టం తెచ్చిందని ఈ కొత్త చట్టం వల్ల రాష్ట్ర ప్రభుత్వాలపై అధిక భారం పడుతుందని పాత చట్టం ఉన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు 10 శాతం కేంద్ర ప్రభుత్వం 90 శాతం నిధులు కేటాయించే వారు కొత్త చట్టం వల్ల రాష్ట్రాలు 40 శాతం కేంద్రం 60 శాతం నిధులు భరించవలసి వస్తుందని అందువలన ఈ కొత్త చట్టాన్ని సిఐటియు తీవ్రంగా వ్యతిరేకిస్తుందన్నారు.
ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు రామ్మోహన్, ముస్తాక్ అలీఖాన్, నారాయణ, సుధాకర్ రెడ్డి, శంకర్ రెడ్డి,ఉపాధి హామీ కార్మికులు పాల్గొన్నారు.