శ్రీ సత్య సాయి జిల్లా…
పేకాట స్థావరంపై పోలీసులు విస్తృత దాడులు..
9 మంది అరెస్టు..
రూ,92,590 నగదు తో పాటు
9, సెల్ఫోన్లు ,4, ద్విచక్ర వాహనాలు స్వాధీనం..
జిల్లా ఎస్పీ శ్రీ ఎస్ సతీష్ కుమార్ ఐపీఎస్ గారి ఆదేశాల తో.. కదిరి డిఎస్పి శివన్నారాయణ స్వామి ఆదేశాల మేరకు.. కదిరి రూరల్ సిఐ నాగేంద్ర ఆధ్వర్యంలో ఎన్.పి కుంట మండలంలో పేకాట ఆడుతున్న స్థావరంపై పోలీసులు మెరుపు దాడులు నిర్వహించారు.
తలుపుల, గాండ్లపెంట ఎస్సైలు సుమతి, చెన్నయ్య ల,మరియు వారి సిబ్బంది కలిసి
ఎన్.పి. కుంట మండలం, టీ.ఎన్. పల్లి గ్రామ శివారులో జూదం ఆడుతున్న వారిపై ఆకస్మిక దాడి నిర్వహించారు.
ఈ దాడిలో జూదం ఆడుతున్న 9 మందిని అరెస్ట్ చేయడం జరిగింది.
వారి వద్ద నుండి
➡️ రూ. 92,590/- నగదు,
➡️ 9 మొబైల్ ఫోన్లు,
➡️ 4 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు.
ఈ ఘటనపై సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు సిఐ నాగేంద్ర తెలిపారు.
ఈ సందర్భంగా సిఐ గారు మాట్లాడుతూ పేకాట మట్కా అక్రమ మద్యం అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

