శ్రీ సత్య సాయి జిల్లా కదిరి
- కదిరిలో సామాన్యులపై సాక్షి పత్రిక కక్ష సాధింపు
- సాక్షి పత్రికలో తప్పుడు కథనంపై పేద బ్రాహ్మణుడు ప్రభాకర్ ప్రసాద్ తీవ్ర ఆవేదన
- కదిరిలో ఫక్రుద్దీన్ అనే వ్యక్తి నుండి తమ కుటుంబ సభ్యులు 1915 లో ఆస్తిని కొనుగోలు చేశారు
- అయితే సాక్షి దురుద్దేశపూర్వకంగా తప్పుడు కథనాలు రాసిందని ఆవేదన
- సబ్ రిజిస్టర్ ఆఫీసులో రిజిస్ట్రేషన్ అయిన అంశాన్ని పరిగణలోకి తీసుకోకుండా రాయడం తగదు
- సమాచారాన్ని దాచిపెట్టి లేని సమాచారం, విషయాలను సాక్షిలో ప్రచురించడం సరైన పద్ధతి కాదు
- ప్రైవేట్ ఆస్తులను దొంగ ఆస్తులుగా చిత్రీకరించడం సమంజసం కాదు
- తప్పుడు సమాచారాన్ని పేపర్లో రాయడం ద్వారా సమాజానికి సరైనటువంటి మార్గదర్శకం ఇవ్వడం సాక్షి పూర్తిగా విఫలమైంది
- సాక్షిపై పరువు నష్టం దావా వేస్తామని తెలిపిన బ్రాహ్మణుడు ప్రభాకర్ ప్రసాద్.
- రాజకీయ ఉద్దేశాలు ఉంటే మీరు మీరు చూసుకోండి
- 40 సంవత్సరాలు విలేకరుగా కొనసాగాను
- కదిరిలో తన గురించి అందరికీ తెలుసు
- మంచి చేసే తమపై నిరాధారమైన ఆరోపణలు చేయడం పద్ధతి కాదు
- 1915 లో ఫక్రుద్దీన్ అనే వ్యక్తి నుండి సీతారామయ్య కొనుగోలు చేశారు
- డాక్యుమెంట్ నెంబర్ 1943 ఏమైనా అనుమానాలు ఉంటే సబ్ రిజిస్టర్ ఆఫీసులో చూసుకోవచ్చు
- పూర్వికులు నుండి వచ్చిన ఆస్తిని కంకణం కట్టుకొని సాక్షి తప్పుడు కథనాలు రాసింది
- సాక్షి రాసిన తప్పుడు కథనంపై పూర్తి ఆధారాలు చూపిన సీనియర్ జర్నలిస్టు ప్రభాకర్ ప్రసాద్…
శ్రీ సత్య సాయి జిల్లా కదిరిలో 100 కోట్ల ఆస్తి పై కన్నేసారని రాజకీయ దురుద్దేశంతో సాక్షి పత్రిక లేనిపోని అసత్య కథనాలు ప్రచురించడం పై సామాన్యుల పై సాక్షి పత్రిక కక్ష సాధింపులకు పాల్పడుతున్నదని తప్పుడు కథనంపై కదిరిలో పేద బ్రాహ్మణుడు ప్రభాకర్ ప్రసాద్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కదిరిలో సాక్షి పత్రిక తప్పుడు కథనంపై పేద బ్రాహ్మణుడు ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కదిరిలో ఫక్రుద్దీన్ అనే వ్యక్తి నుండి తమ కుటుంబ సభ్యులు 1915లో ఆస్తిని కొనుగోలు చేశారన్నారు. డాక్యుమెంట్ నెంబర్ 1943 అని ఈ విషయం సబ్ రిజిస్టర్ ఆఫీసులో ఉంటుందని ఆ విషయాలను పరిగణలోకి తీసుకోకుండా సమాచారాన్ని దాచిపెట్టి లేని సమాచారాన్ని విషయాలను సాక్షి రాసిందని ఆరోపించారు ప్రైవేట్ ఆస్తులను దొంగ ఆస్తులుగా చిత్రీకరించడం సమంజసం కాదన్నారు తప్పుడు సమాచారాన్ని పేపర్లో రాయడం ద్వారా సమాజానికి సరైనటువంటి మార్గదర్శకం ఇవ్వడం సాక్షి పూర్తిగా విఫలమైందన్నారు. తప్పుడు కథనాలు రాసిన సాక్షి యాజమాన్యంపై విలేకరులపై పరువు నష్టం దావా వేస్తామని పేద బ్రాహ్మణుడు ప్రభాకర్ ప్రసాద్ తెలిపారు. రాజకీయ ఉద్దేశాలు ఉంటే మీరు మీరు చేసుకోండి అంతేగాని లేని సమాచారాన్ని సృష్టించి రాజకీయ అవసరాల కోసం తమపై బురద చల్లడం మంచి పద్ధతి కాదన్నారు. 40 సంవత్సరాలుగా కదిరిలో విలేకరుగా కొనసాగానని ఎవరికి ఎటువంటి హాని కలిగించలేదని సేవా తత్పథంతో పనిచేశానన్నారు.తన సేవ గురించి ఎవరు అడిగిన చెబుతారన్నారు. మంచి చేసే తమపై నిరాధారమైన ఆరోపణలు చేయడం తమను ఎంతో బాధ కలిగించిందని ఆవేదన వ్యక్తం చేశారు.1915లో ఫక్రుద్దీన్ అనే వ్యక్తి నుండి తమ తాత సీతారామయ్య కొనుగోలు చేశారని డాక్యుమెంట్ నెంబర్ 1943 ఏమైనా అనుమానాలు ఉంటే సబ్ రిజిస్టర్ ఆఫీసులో చూసుకోవచ్చు అన్నారు. పూర్వికులు ఉండి వచ్చిన తమ ఆస్తిని కంకణం కట్టుకొని సాక్షి తప్పుడు కథనాలు రాసిందని ఆవేదన వ్యక్తం చేశారు. సాక్షి రాసిన తప్పుడు కథనంపై సీనియర్ జర్నలిస్ట్ ప్రభాకర్ ప్రసాద్ పూర్తి ఆధారాలు చూపారు.

