శ్రీ సత్యసాయి జిల్లా కదిరి
- కదిరిలో ప్రైవేట్ ఆస్తులపై వైసీపీ నియోజవర్గ సమన్వయకర్త మక్బూల్ అహ్మద్ ప్రకటనపై తీవ్రస్థాయిలో స్పందించిన సామాన్య బ్రాహ్మణుడు ప్రభాకర్ ప్రసాద్
- సాక్షాదారాలు లేకుండా మక్బుల్ ప్రకటన చేయడం తగదు
- 1915 వ సంవత్సరంలో డాక్యుమెంట్ నెంబర్ 1584 ద్వారా ఫక్రుద్దీన్ అనే వ్యక్తి నుండి తమ ముత్తాత సీతారామయ్య కొనుగోలు చేశాడు
- ఈ విషయం పదే పదే చెబుతున్నప్పటికీ దాన్ని మసి పోసి మారేడు కాయ చేస్తూ మైనార్టీల భూమి అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు
- తప్పుడు ప్రచారం చేస్తూ రాజకీయ ఉద్దేశాలను మనసులో పెట్టుకొని సామాన్య ఆస్తులపై రాజకీయాలు చేస్తూ ప్రయోజనం పొందాలని చూడడం ఎంతో దురదృష్టకరం
- ఇది వ్యక్తులు, పార్టీలు, సమూహము, సంఘాలకు గాని ఇది సరైన పద్ధతి కాదు.
- బాధితులకు అండగా ఉంటామని మక్బూల్ ప్రకటించాడు… ఇక్కడ బాధితులు ఎవరు అనేది ప్రకటనలో ఎక్కడ పేర్కొనలేదు
- ఆరోపణలు ఎదుర్కొంటున్న మేము బాధితులమా… లేకపోతే ఎవరు ఇక్కడ బాధితులు అనేది స్పష్టంగా పేర్కొనలేదు
- బాధితులకు అండగా ఉంటామని పేర్కొనడం హర్షనీయమే… కానీ బాధితులను గుర్తించడంలో వైపల్యం మాత్రం క్షమించరానిదే
- ముస్లింలకు అండగా ఉంటామని అంటున్నారు మీరు. మీరు హిందువులకు వ్యతిరేకమా
- అది మీ పార్టీ విధానమా…
- ఇలాంటి చెత్త ప్రకటనలు చేయడం మానుకోవాలని హితువు
- ప్రైవేట్ వ్యక్తుల నుండి ఆస్తులు కొనుగోలు చేసినప్పుడు ఇతరులకు విక్రయించరాదా
- మేము కొనుగోలు చేసిన ఆస్తిని ఒక వర్గానికి అంటగడుతూ ప్రచారం చేయడం ఎంతవరకు సమంజసం
- మైనార్టీల ఆస్తులని పదే పదే తప్పుడు ప్రచారం చేయడం సరైన పద్ధతి కాదు
- పదేపదే నొక్కి చెబుతున్నప్పటికీ మాపై కంకణం కట్టుకొని ప్రకటనలు చేస్తున్నారు
- ఈ విధానం చూస్తుంటే తమపై కక్ష సాధింపులకు పాల్పడుతున్నారనే విషయం స్పష్టంగా అర్థం అవుతున్నది
- వాస్తవాలను గ్రహించాలనే ఉద్దేశం మీలో కనపడలేదు
- ఈ భూమిని ఎవరూ కొనుగోలు చేయొద్దు అని చెప్పడంలో మీ విజ్ఞత ఏమిటి
- క్రయవిక్రయాల విషయంలో సరైన పత్రాలు ఉన్నాయా లేవా అనే విషయం చూస్తారు.
- ఇప్పటికైనా వైసీపీ నేతలు, సాక్షి తప్పుడు ప్రచారాలు మానుకోవాలని ఘాటుగా హెచ్చరించిన సామాన్య బ్రాహ్మణుడు ప్రభాకర్ ప్రసాద్
కదిరిలో తమకు సంబంధించిన ఆస్తులపై వైసీపీ నియోజవర్గ సమన్వయకర్త మక్బూల్ అహ్మద్ ప్రకటన చేయడంపై సామాన్య బ్రాహ్మణుడు ప్రభాకర్ ప్రసాద్ తీవ్రస్థాయిలో పరిగణించాడు. ఎటువంటి సాక్షాదారాలు లేకుండా మక్బూల్ రాజకీయ దురుద్దేశంతో ప్రకటన చేయడం పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. 1915 వ సంవత్సరంలో డాక్యుమెంట్ నెంబర్ 1584 ద్వారా ఫక్రుద్దీన్ అనే వ్యక్తి నుండి తమ ముత్తాత సీతారామయ్య ఆస్తిని కొనుగోలు చేశాడని ఈ విషయం పదేపదే చెబుతున్నప్పటికీ దాన్ని మాసి పోసి మారేడు కాయ చేస్తూ మైనార్టీల భూమి అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని తీవ్ర స్థాయిలో విమర్శించారు. తప్పుడు ప్రచారం చేస్తూ రాజకీయ ఉద్దేశాలను మనసులో పెట్టుకొని సామాన్య వ్యక్తుల ఆస్తులపై రాజకీయాలు చేస్తూ ప్రయోజనం పొందాలని చూడడం ఎంతో దురదృష్టకరమన్నారు. ఇది వ్యక్తులు, పార్టీలు ,సమూహము, సంఘాలకు ఏమాత్రం సరైన పద్ధతి కాదు అన్నారు. బాధితులుగా అండగా ఉంటామని ప్రకటించారు ఇక్కడ బాధితులు ఎవరు అనేది ప్రకటనలో ఎక్కడ పేర్కొనలేదు. ఆరోపణాలు ఎదుర్కొంటున్న మేము బాధితులమా… లేకపోతే ఎవరు ఇక్కడ బాధితులు అనేది స్పష్టంగా చెప్పలేదు. బాధితులకు అండగా ఉంటామని మక్బూల్ పేర్కొనడం హార్షనీయమే కానీ బాధితులను గుర్తించడంలో వైఫల్యం మాత్రం క్షమించరానిదే అనే విషయం గుర్తించుకోవాలని హితువు పలికారు.ముస్లింలకు అండగా ఉంటామని అంటున్నారు మీరు. మీరు హిందువులకు వ్యతిరేకమా ఆ విషయం కూడా తెలపాలన్నారు.అది మీ పార్టీ విధానమా అని ప్రశ్నించారు.
ఇలాంటి చెత్త ప్రకటనలు చేయడం మానుకోవాలన్నారు. ప్రైవేట్ వ్యక్తుల నుండి ఆస్తులు కొనుగోలు చేసినప్పుడు ఇతరులకు విక్రయించరాదా ఆ విషయం కూడా మీకు తెలియదా అని సూటిగా ప్రశ్నించారు. మేము కొనుగోలు చేసిన ఆస్తిని ఒక వర్గానికి అంటగడుతూ ప్రచారం చేయడం ఎంతవరకు సమంజసం అన్నారు. మైనార్టీల ఆస్తులు అని పదేపదే తప్పుడు ప్రచారం చేయడం సరైన పద్ధతి కాదన్నారు. పదేపదే నొక్కి చెబుతున్నప్పటికీ మాపై కంకణం కట్టుకొని నిందలు వేయడం తమను ఎంతో కలచి వేసిందన్నారు. మీ విధానం చూస్తుంటే తమపై కక్ష సాధింపులకు పాల్పడుతున్నారనే విషయం స్పష్టంగా అర్థం అవుతున్నది. వాస్తవాలను గ్రహించాలనే ఉద్దేశం మీలో ఎక్కడ కనపడలేదన్నారు. ఈ భూమిని ఎవరు కొనుగోలు చేయొద్దని చెప్పడంలో మీ విజ్ఞత ఏమిటని ప్రశ్నించారు. సరైన పత్రాలు ఉన్నాయా లేవా అనే విషయం చూసి క్రయవిక్రయాలు జరుగుతాయనే విషయం గ్రహించాలన్నారు. ఇప్పటికైనా వైసీపీ నేతలు, సాక్షి పత్రిక తప్పుడు ప్రచారాలు మానుకోవాలని సామాన్య బ్రాహ్మణుడు ప్రభాకర్ ప్రసాద్ ఘాటుగా హెచ్చరించారు.

