AP

కదిరి గిరి ప్రదక్షిణ: భక్తులు భయపడొద్దు.. అవాస్తవాలు ప్రచారం చేస్తే చర్యలు తప్పవు – సేవా సమితి వినతి

“శ్రీ వారి జన్మ నక్షత్రం స్వాతి నక్షత్రం రోజున శ్రీ వారి గిరి ప్రదక్షిణలో పాల్గొనే భక్తులకు ధైర్యాన్ని కల్పించి అవాస్తవాలను ప్రచారం చేసే వారిపై చర్యలు తీసుకోండి.”- శ్రీ ఖాద్రీ లక్ష్మీ నృసింహ సేవా సమితి

శ్రీ వారి జన్మ నక్షత్రం స్వాతి నక్షత్రం సందర్భంగా శ్రీ వారు కొండల లక్ష్మీనరసింహుడుగా కొలువైన స్తోత్రాద్రికి (కదిరి కొండ) ప్రతినెల పెద్దయెత్తున శ్రీ వారి భక్తులు గిరి ప్రదక్షిణ చేస్తున్నారు.ఈ మధ్య కాలంలో గొడ్డువెలగలకు వెళ్ళే దారిలో పులి పాద ముద్రలు కనిపించడం అవి అటవీ శాఖ అధికారులు నిర్ధారించడం జరిగిందని ఇదే అదునుగా కొద్దిమంది సోషియల్ మీడియా వేదికగా కుమ్మర వాండ్ల పల్లి గ్రామంలో పులి సంచరిస్తున్నట్లు ఎక్కడో ఆంధ్రా కర్ణాటక సరిహద్దులో పులి సంచరిస్తున్న వీడియోను పోస్ట్ చెయ్యడం వల్ల శ్రీ వారి భక్తులు , గ్రామ ప్రజలు భయాందోళనకు గురి అవుతున్నారని ఈనెల శ్రీ వారి గిరి ప్రదక్షిణలో పాల్గొనే భక్తులకు అటవీ శాఖ , పోలీస్ డిపార్ట్మెంట్ , ఆలయ సిబ్బందిని కేటాయించి గిరి ప్రదక్షిణకు పలు సలహాలు సూచనలు అందించాలని అవాస్తవాలను సోషియల్ మీడియాలో మరియు యూట్యూబ్ ఛానెల్స్ లో ప్రచారం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కదిరి అటవీ శాఖ అధికారి గుర్రప్ప గారికి , కదిరి రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ నిరంజన్ రెడ్డి గారికి , మరియు శ్రీ మత్ ఖాద్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయ ఉప కమిషనర్ మరియు కార్యనిర్వహణ అధికారి వెండిదండి శ్రీనివాస్ రెడ్డి గారికి శ్రీ ఖాద్రీ లక్ష్మీ నృసింహ సేవా సమితి తరపున వినతి పత్రం అందించడం జరిగింది.ఈ విషయంపై కదిరి నియోజకవర్గం పరిధిలో ఎక్కడా పులి దాడి చేసిన దాఖలాలు లేవని కేవలం పాద ముద్రలు మాత్రమే వచ్చాయని శ్రీ వారి స్తోత్రాద్రి గిరి ప్రదక్షిణను యదావిధిగా కొనసాగించుకోవచ్చని కానీ గుంపులు గుంపులుగా చెయ్యడం వల్ల ఎటువంటి ప్రమాదం జరగదని అంతే కాకుండా అటవీ ప్రాంతం కావడం వల్ల కొద్దిపాటి జాగ్రత్తులు తీసుకొంటే సరిపోతుందని అటవీ శాఖ అధికారులు , మరియు పోలీసు అధికారులు , ఆలయ అధికారులు భక్తులకు సూచిస్తున్నారు.