AP

శ్రీ సత్యసాయి జిల్లాలో బాలికపై లైంగిక దాడి మరియు గర్భస్రావం కేసు: ముద్దాయి అరెస్టు మరియు వాస్తవాల వెల్లడి

, Cr.No.8/2026 U/సెక్షన్ 65(1), 88 BNS మరియు POCSO యొక్క సెక్షన్ 3 & 4

చట్టం, 2012, తేదీ. 01-02-2026.

ఫిర్యాది : యర్లం నీలమ్మ, వయస్సు 30సం., W/o రామ్మోహన్, యాదలవాండ్లపల్లి గ్రామం, NP కుంట మండలం, శ్రీ సత్య సాయి జిల్లా.

ముద్దాయి : కుంచేపు మహేంద్ర, వయస్సు 25 సం., యాదలవాండ్లపల్లి గ్రామం, NP కుంట మండలం, శ్రీ సత్య సాయి జిల్లా.

కేసు సంక్షిప్త వివరాలు :

బాధిత బాలిక మరియు ఆమె తల్లి, తెలిపిన వాస్తవాల మేరకు, బాధిత బాలిక NP కుంట మండలంలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో 8వ తరగతి చదువుతోంది. 2025 అక్టోబరు నెలలో దసరా సెలవుల సమయంలో బాధితురాలు ఇంటికి వచ్చినప్పుడు, అదే గ్రామానికి చెందిన బాధిత బాలిక సొంత బావ అయిన ముద్దాయి కుంచేపు మహేంద్ర ఆమె ను తన ఇంటికి వంట చేయు నిమిత్తము పిలిపించుకొని ఆమె పై ఒక సారి మాత్రమే లైంగిక దాడి చేసినట్లు బాధిత బాలిక వాంగ్మూలంలో పేర్కొంది. దీనివల్ల ఆమె నాలుగు నెలల గర్భవతి అయినట్లు వెల్లడించింది. అనంతరం, 28-01-2026 తేదీన ముద్దాయి బాధితురాలిని అన్నమయ్య జిల్లా, రాయచోటి టౌన్లోని గౌరి నర్సింగ్ హోమ్ కు తీసుకెళ్లి గర్భస్రావానికి ఇంజక్షన్ వేయించాడని, అదే రోజు బాధితురాలికి గర్భస్రావం జరిగినట్లు విచారణలో వెల్లడైంది. బాధిత బాలిక మరియు ఆమె తల్లిదండ్రుల వాంగ్మూలాల ఆధారంగా, పై పేర్కొన్న ఆసుపత్రి వారి పాత్రను కూడా ఈ కేసులో చేర్చడం జరిగింది. అదేవిదంగా ముద్దాయి కుంచేపు మహేంద్ర నేర ఒప్పుదల మేరకు మరియు పై కేసులో ఇప్పటి వరకు జరిగిన దర్యాప్తు ప్రకారము ఈ నేరములో బాధిత బాలిక పై తన సొంత బావ కుంచేపు మహేంద్ర మాత్రమే లైంగిక దాడి చేసినట్లుగా తెలిసినది. నిన్నటి దినము వరకు ఎలక్ట్రానిక్ మీడియా మరియు ప్రింట్ మీడియా లో వైరల్ అయిన వార్తలు అవాస్తవాలు.

ముద్దాయి అరెస్టు వివరాలు :

02-02-2026 తేదీన అందిన నమ్మదగిన సమాచారంతో CI, కదిరి రూరల్ సర్కల్ గారు, SI, NP కుంట పోలీస్ స్టేషన్ గారు మరియు సిబ్బంది కలిసి, గాండ్లపెంట మండలం, రెక్కమాను-