తిరుమల తిరుపతి దేవస్థానం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి లడ్డూ కల్తీకి పాల్పడి మహాపచారం చేసిన దోషులకు శిక్ష తప్పదు – జనసేన పార్టీ ఇంచార్జీ భైరవ ప్రసాద్
ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి కోట్లాది మంది హిందువుల మనోభావాలనే కాకుండా శ్రీ వారిని ఆరాధించే భక్తుల మనోభావాలను అవహేళన చేస్తూ జగన్ రెడ్డి పాలనలో తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డూకు తయారీకి నెయ్యిని సరఫరా చేసే సామర్థ్యం లేని భోలే బాబా డెయిరీకి తమ స్వార్థ ప్రయోజనాల కోసం 20 లక్షలకు పైగా కల్తీ లడ్డూలను 2019 వ సంవత్సరం నుంచి 2024 వ సంవత్సరం వరకూ తయారు చేసింది.తిరుమల తిరుపతి దేవస్థానం ప్రధాన అర్చకులు సైతం ఆ కల్తీ లడ్డు ప్రసాదాలను శ్రీ వారికి నైవేద్యంగా పెట్టలేని పరిస్థితి ఉండేదని ఆవేదన వ్యక్తం చేశారు.ఇదే విషయాన్ని మా అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ శ్రీ వారి లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందని అందుకు ప్రధాన సూత్రధారులు జగన్ రెడ్డి,భూమన కరుణాకర్ రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి , ధర్మా రెడ్డి అనేది స్పష్టం ఐపోయింది వీళ్ళు చేసిన తప్పుకు ఆయన ప్రాయశ్చిత్య దీక్ష చేపట్టడం జరిగింది.ఆనాడు మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు , నారా చంద్రబాబు నాయుడు చెప్పిన మాట నిజమే అన్నట్లుగా సుప్రీం కోర్టు ఏర్పాటు చేసిన SIT విచారణలో శ్రీ వారి లడ్డూ కల్తీ జరిగిందని నిర్ధారించింది.చేసిన తప్పును కప్పి పుచ్చుకోవడం కోసం జగన్ రెడ్డి & కో డైవర్ట్ పాలిటిక్స్ చేసే క్రమంలోనే అంబటి రాంబాబు , జోగి రమేష్ లతో కులాల మధ్య అలజడి సృష్టించే విధంగా కుట్ర పూరిత రాజకీయాలు చేస్తున్నాడు. “వై యేసు రెడ్డి” నువ్వు మరియు మీ YSRCP నాయకులు చేసిన తప్పుకు బహిరంగ క్షమాపణ చెప్పు.నీ అసమర్ధ చేతకాని పాలనకు 151 స్థానాల నుంచి 2024 సార్వత్రిక ఎన్నికల్లో 11స్థానాలకే పరిమితం చేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు. జగన్ రెడ్డి నీ తీరు మార్చుకో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి విషయంలో చేసిన అపాచారాన్ని ఒప్పుకో లేకపోతే నీకు పుట్టగతులు ఉండవు అని కదిరి జనసేన పార్టీ ఇంచార్జీ భైరవ ప్రసాద్ గారు కార్యాలయంలో మీడియా సమావేశంలో తెలియజేశారు.

