పీ ఆర్సీ, 29% ఐ.ఆర్ విడుదల చేయాలి:కదిరి శాసనసభ్యులు కందికుంట వెంకటప్రసాద్ గారికి
యూటీఎఫ్ నాయకత్వం వినతి
కదిరి టౌన్, ఫిబ్రవరి 5: కూటమి ప్రభుత్వం ఏర్పడి ఆశగా ఎదురుచూస్తున్నా ఉద్యోగ, ఉపాధ్యాయులకు రావలసిన ఆర్ధిక అంశాలలో తీవ్ర అన్యాయం జరిగిందని, వివిధ రకాల బకాయిలు రూ 25వేల కోట్ల మేరకు పేరుకు పోయిన నేపథ్యంలో యూ.టి.ఎఫ్ జిల్లా అధ్యక్షుడు డి శ్రీనివాసులు, జిల్లా కార్యదర్శులు మల్లికార్జున, రవివర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో యూ.టి.ఎఫ్ కదిరి డివిజన్ నాయకత్వం గౌరవ కదిరి శాసనసభ్యులు కందికుంట వెంకటప్రసాద్ కి వచ్చే బడ్జెట్లో ఉద్యోగ, ఉపాద్యాయులకు సంబంధించిన ఆర్థిక సమస్యల పరిష్కారం కోసం నిధులు కేటాయించాలని వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పడి దాదాపు 2 సంవత్సరాలు గడిచిన ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారిందన్నారు. అడపదడపా కొన్ని బకాయిలు చెల్లించడం తప్పా మా సమస్యలు తీరలేదన్నారు. దీపావళి కానుకగా ఒక డీ.ఏ తో సరిపెట్టారని, సంక్రాంతి కానుకగా రూ1100కోట్లు డీఏ బకాయిలు జమ కాలేదన్నారు. అన్నింటికీ మించి ఉద్యోగులకు 12 వ పీఆర్సీ 01.07.2023 నుండి అమలు కావాల్సి ఉందన్నారు. గత ప్రభుత్వం 12 వ పీఆర్సీ కమిషన్ నియమించినా ప్రభుత్వం మారడంతో ఆయన తన పదివికి రాజీనామా చేశారన్నారు. వారు రాజీనామా చేసి 18 నెలలు గడిచినా ఇంకా కొత్త కమిషనర్ ను నియమించ లేదన్నారు. ఇప్పటికే 30 నెలల పాటు రావాల్సిన పీఆర్సీ ప్రయోజనాలు కోల్పోతున్నామని అవేదన వ్యక్తం చేశారు. రిటైర్డు అయిన వారికి 18 నెలల కాలంగా గ్రాట్యుటీ, లీవు ఎన్కాష్మెంట్ చెల్లించడం లేదన్నారు. వీటన్నింటి నేపథ్యంలో ఉద్యోగ, ఉపాధ్యాయ పెన్షనర్లలో అసంతృప్తి రోజు రోజుకూ పెరుగుతుందన్నారు. ఇది మరింతగా పెరగకుండా ప్రభుత్వం సకాలంలో స్పందించి చర్యలు చేపట్టాలని కోరుతున్నట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఆడిట్ కమిటీ కన్వీనర్ సునీల్ కుమార్, సీనియర్ నాయకులు సుబ్బారెడ్డి, జిల్లా మున్సిపల్ కమిటీ కన్వీనర్ మధుసూదన్, జిల్లా క్రీడల కమిటీ కన్వీనర్ ఆజమ్ బాషా, జిల్లా సిపిఎస్ సబ్ కమిటీ కో కన్వీనర్ సునీల్ కుమార్, యుటిఎఫ్ నాయకుడు రెడ్డి రాజేష్, హనీఫ్, నాగరాజు,భార్గవ్, నజీర్, బ్రహ్మేంద్ర, ఖాజా మోహియోద్దీన్,రమణా నాయక్, ఖాదర్ బాషా, లక్ష్మిప్రసాద్,నారాయణ రెడ్డి,శివ , రామ సుబ్బయ్య ,చంద్ర శేఖర్,మనోహర్, బాలాజీ నాయక్, షరీఫ్, tvn రమేష్, ఖాజాపీర్, తదితరులు పాల్గొన్నారు.

