ప్రభుత్వ పాలిటెక్నిక్ కదిరిలో ఇండి గ్రిడ్ కంపెనీ వారిచే ప్రాంగణ నియామక ప్రక్రియ
స్థానిక ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల కదిరి లో ఈరోజు ఇండి గ్రిడ్ కంపెనీ వారిచే ప్రాంగణ ఎంపికలు నిర్వహించారు ,ఇందులో భాగంగా వారు రాత పరీక్ష మరియు మౌఖిక పరీక్షలు నిర్వహించి కళాశాల నుండి ముగ్గురు విద్యార్థులను ఎంపిక చేసినట్లు కంపెనీ యాజమాన్యం కళాశాల ప్రిన్సిపల్ ఆయన పి భాస్కర్ గారికి తెలియజేశారు. ఈ కంపెనీ నంబులపుల కుంట దగ్గర వెలిగల్లు గ్రామంలో సౌర పలకల ద్వారా 100 మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేస్తున్నారు. ఈ ప్రక్రియలో ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ మూడవ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు 14 మంది రాత పరీక్షకు హాజరయ్యారు. ఇందులో 9 మంది మౌఖిక పరీక్షకు ఎంపికయ్యారు. వారిలో ముగ్గురు విద్యార్థులు కంపెనీ ఎంపిక చేసుకున్నారు. ఎంపిక అయిన వారి వార్షిక వేతనం మూడు లక్షలు అని కంపెనీ యాజమాన్యం తెలియచేశారు. దీనికి కళాశాల యాజమాన్యం ప్రిన్సిపల్ పి .భాస్కర్ గారు మరియు అధ్యాపక సిబ్బంది ఎంపికైన విద్యార్థులకు అభినందనలు తెలియజేశారు.

