AP

కదిరిలో ఎన్నికల హామీలను తక్షణమే నెరవేర్చాలి: కాంగ్రెస్ నాయకుడు పి.ఎస్. అహ్మద్ డిమాండ్

కదిరిలో తెలుగుదేశం పార్టీ ఇచ్చిన ఎన్నికల హామీలను వెంటనే పూర్తి చేయాలి.PS అహ్మద్. డిమాండ్. ఈరోజు కదిరి పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో జరిగిన ప్రెస్ మీట్ లో కాంగ్రెస్ నాయకులు P.S. అహ్మద్ హుస్సేన్. మరియు జిల్లా మైనార్టీ అధ్యక్షులు అష్రఫ్ మీడియా కోఆర్డినేటర్ ఇర్ఫాన్ పాల్గొన్నారు ఈ సందర్భంగా పిఎస్ అహ్మద్ మాట్లాడుతూ కదిరి పట్టణంలో ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీ అధినేత శ్రీ నారా చంద్రబాబునాయుడు గారు కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ గారి సమక్షంలో ఏ హామీలు అయితే ఇచ్చారో వాటిని తొందరగా పూర్తిచేసి ఎన్నికలలో ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాల్సిందిగా కోరారు ఆ హామీలలో కదిరి పట్టణానికి సంబంధించి రింగ్ రోడ్డును అనంతపురం రాయచోటి చెన్నై రోడ్డును తొందరగా నిర్మించడం మరియు టెక్స్టైల్స్ పార్కును ఏర్పాటు చేసి కదిరిలో నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలని కోరుతున్నాం. మరియు కదిరి మైనార్టీ ఫంక్షన్ హాల్ మరమ్మత్తులు తొందరగా పూర్తి చేసి పేద ముస్లింలకు అందుబాటులోకి తేవాల్సిందిగా డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సత్య సాయి జిల్లా మైనార్టీ అధ్యక్షులు హుదాబక్ష మరియు మీడియా కోఆర్డినేటర్ ఇర్ఫాన్ నియోజకవర్గ మైనార్టీ నాయకులు షౌఖత్ అలీ ఖాన్ తదితరులు పాల్గొన్నారు