కదిరి టౌన్, మూర్తిపల్లి గ్రామమునకు చెందిన ఎబ్బిలి చంద్రమౌళి, వయసు 35, తండ్రి నరసింహులు అను వ్యక్తి గత పది సంవత్సరాలు నుండి ప్రభుత్వాసుపత్రికి సంబంధించిన తల్లి, బిడ్డ ఎక్స్ ప్రెస్ నందు గల వాహనానికి డ్రైవర్ గా పనిచేస్తున్నాడని, అతనికి భార్య లావణ్య, 04 సంవత్సరాల కుమారుడు కలడని, అయితే గత రాత్రి సుమారు 9 గంటల సమయంలో ప్రభుత్వ కాలేజీ సమీపములో పురుగుల మందు తాగి ఇంటికి వెళ్ళగా అక్కడ అతనికి పరిస్థితి గమనించిన అతని భార్య ఇతర బంధువులు ప్రభుత్వాసుపత్రికి తీసుకొని రాగ అక్కడ చికిత్స పొందుతూ చనిపోవడము జరిగింది. పూర్తి వివరాలు తెలియవలసి ఉంది. వారి బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయడం జరుగుతుంది.
ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్,
కదిరి టౌన్ పిఎస్.

