AP

వికసిత్ 2047 రూపకల్పన బడ్జెట్..

  • వికసిత్ 2047 రూపకల్పన బడ్జెట్
  • 2026 బడ్జెట్ అంకెల గారిడి కాదు
  • రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ 5 కోట్ల మంది ప్రజల అభీష్టం మేరకు ముందుకు
  • అభివృద్ధి సంక్షేమానికి పెద్దపీట
  • రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలు అభ్యున్నతి కోసం ప్రవేశ పెట్టిన
  • రైతాంగానికి పెద్ద పీట వేస్తూ 13వేలు కోట్లు అమలు
  • ధరల స్త్రీరీకరణకు అత్యధికంగా కేటాయింపు
  • ఆపద్ధాలు వల్లివేయడంలో జగన్ దిట్ట
  • పేదవాడి సొంతింటి కోసం 6750 కోట్లు రూపాయలు నిధులు కేటాయింపు
  • బీసీ ల సంక్షేమం కోసం 50 వేలు కేటాయింపు
  • ఎస్సీ ల సంక్షేమం కోసం 20 వేలు కోట్లు
  • మైనార్టీల అభ్యున్నతికి కోసం 6వేలు కోట్లు నిధులు కేటాయింపు
  • అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం 91 వేలు కోట్లు కేటాయింపు
  • న్యాయవ్యవస్త కోసం 300 కోట్లు
  • మున్సిపల్ పట్టణాభివృద్ధి కోసం 14వేలు కోట్లు
  • బడ్జెట్ పై బహిరంగ చర్చకు సిద్ధమా

రాష్ట్ర ప్రభుత్వం విషన్ 2047 రూపకల్పన దిశగా ముందుకు సాగుతోందని ఎమ్మెల్యే కంది కుంట వెంకట ప్రసాద్ స్పష్టం చేశారు.సోమవారం కదిరి పట్టణంలోని రోడ్లు భవనాలు అతిథి గృహం నందు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజలు అభ్యున్నతి కోసం 5కోట్ల మంది ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రవేశపెట్టిన ప్రజరణంజక బడ్జెట్ అన్నారు. రైతాంగానికి ,విద్యుత్ రంగానికి సంక్షేమానికి అభివృద్ధికి పెద్దపీట వేస్తుందని తెలిపారు. కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ వైసిపి అధినేత జగన్ వాస్తవాలు తెలుసుకోనీ మాట్లాడాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ బడ్జెట్ పై ఎక్కడికైనా బహిరంగ చర్చకు సిద్ధం అని సవాల్ విసిరారు.