సత్య సాయి జిల్లా కదిరి క్షయవ్యాధితో బాధపడుతున్న రోగులకు పోషకాహార కిట్ల పంపిణీ కార్యక్రమంలో కదిరి నియోజకవర్గ శాసనసభ్యుడు శ్రీ కందికుంట వెంకటప్రసాద్ గారు పాల్గొన్నారు ప్రధానమంత్రి ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా అమలు అవుతున్న టి.బి. ముక్త్ భారత్ అభియాన్ – gపోషణ యోజన పథకం కింద ఈ కార్యక్రమం నిర్వహించబడింది. ఈ సందర్భంగా శాసనసభ్యుడు వెంకట ప్రసాద్ మాట్లాడుతూసంగ్వూ మరియు AG&P ప్రధం కంపెనీ సహకారంతో క్షయవ్యాధి రోగులకు శనగలు, కంది బేడలు, పెసర బేడలు, చెనిగి విత్తనాలు వంటి పోషకాహార పదార్థాలతో కూడిన ప్రత్యేక పోషణ కిట్లను అందజేశామని తెలిపారు. నియోజకవర్గం మొత్తంలో 276 మంది టి.బి. రోగులకు ఈ పోషకాహార కిట్లు పంపిణీ చేయగా, కదిరి మున్సిపాలిటీ పరిధిలో109 మంది లబ్ధిదారులు ఈ సహాయాన్ని పొందినట్లు వివరించారు.
క్షయవ్యాధి నిర్మూలనలో పోషకాహారం అత్యంత కీలక పాత్ర పోషిస్తుందని స్పష్టం చేశారు. ప్రభుత్వం కేవలం వైద్య చికిత్సతోనే కాకుండా రోగులు త్వరగా కోలుకునేందుకు అవసరమైన పోషక మద్దతును కూడా అందిస్తోందని చెప్పారు. ప్రజలు భయపడకుండా టి.బి. పరీక్షలు చేయించుకుని, ప్రభుత్వం అందిస్తున్న పథకాల ప్రయోజనాలను వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా క్షయవ్యాధి నిర్మూలన లక్ష్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విస్తృత చర్యలు చేపడుతుండగా, పోషణ మద్దతు, స్క్రీనింగ్ క్యాంపులు, అవగాహన కార్యక్రమాలు వంటి చర్యలు కూడా అమలు అవుతున్నాయి. టి.బి. ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమం కింద రోగులకు ఉచిత చికిత్సతో పాటు పోషణ భత్యం వంటి మద్దతు కూడా అందించబడుతోంది. ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణమే లక్ష్యంగా మా కూటమి ప్రభుత్వం పని చేస్తోందని పేర్కొన్నారు. క్షయవ్యాధి నిర్మూలనలో ప్రభుత్వం, ప్రజలు కలిసి ముందుకు సాగితేనే సంపూర్ణ విజయం సాధ్యమని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో టీబి యూనిట్ సూపర్వైజర్లు శ్రీనివాసులు మరియు విజయ్ కుమార్ టి బి హెచ్ వి పద్మావతి కదిరి మండలం తెలుగుదేశం మహిళా అధ్యక్షురాలు ప్రేమలత గారు పాల్గొన్నారు

