AP

కదిరి ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు – 2026: ఘనంగా ఏర్పాట్లు, అధికారుల సమన్వయ సమావేశం

శ్రీ సత్యసాయి జిల్లా, కదిరి పట్టణము వెలశీయున్న శ్రీమత్ ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి వారి బ్రహ్మోత్సవములు-2026 సంవత్సరము సందర్భముగా 27.02.2026  నుండి 13.03.2026 వరకు 15 రోజులు పాటు అత్యంత వైభవముగా జరుగును.
శ్రీస్వామి వారి బ్రహ్మోత్సవములకు వివిధ ప్రాంతముల నుండి విశేషముగా లక్షలాది మంది భక్తులు వచ్చెదరు. సదరు బ్రహ్మోత్సవ రోజులలో భక్తాదులకు ఎటువంటి అసౌకర్యములు కలగకుండ వుండుటకు, బ్రహ్మోత్సవములు విజయవంతముగా నిర్వహించుటకు తీసుకొనవలసిన చర్యలు విషయమై కదిరి శాసన సభ్యులు గౌరవనీయులైన శ్రీ.కందికుంట వెంకటప్రసాద్ గారి సమక్షంలో కదిరి రెవిన్యూడివిజనల్  అధికారి వారు అధ్వర్యంలో వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో తేది:21.02.2026 శనివారము లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానము నందు సమన్వయ సమావేశము నిర్వహించడమైనది.
సమన్వయ సమావేశమునకు వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు,  ఉభయదారులు, మీడియా ప్రతినిధులు మరియు శ్రీస్వామి వారి భక్తాదులు హాజరయ్యారు. అందరి సహకారంతో ఉత్సవాలను విజయవంతం చేస్తామని ఆలయ ఇ.ఒ వెండిదండి శ్రీనివాసరెడ్డి తెలిపారు.