శ్రీ సత్య సాయి జిల్లా…
కదిరిలో ఈనెల 10న జరుగునున్న లక్ష్మీనరసింహస్వామి రథోత్సవ భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా ఎస్పీ గారు…
రథోత్సవ సందర్భంగా పటిష్టమైన భద్రత…
భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తగు సౌకర్యాలు సిద్ధం చేసుకోండి…
జిల్లా ఎస్పీ శ్రీ ఎస్. సతీష్ కుమార్ ఐపీఎస్ గారు…
కదిరి పట్టణంలో జరగనున్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈనెల 10న నిర్వహించనున్న రథోత్సవానికి సంబంధించి భద్రతా ఏర్పాట్లను జిల్లా ఎస్పీ శ్రీ ఎస్. సతీష్ కుమార్ ఐపీఎస్ గారు శనివారం స్వయంగా పరిశీలించారు.
ఈ సందర్భంగా దేవాలయ పరిసర ప్రాంతాలు, రథం ప్రయాణించే మార్గం, ప్రధాన కూడళ్లను జిల్లా ఎస్పీ శ్రీ ఎస్ సతీష్ కుమార్ ఐపీఎస్ గారు సందర్శించి పోలీస్ అధికారులకు పలు సూచనలు చేశారు. జిల్లా ఎస్పీ గారు, డిఎస్పి శివ నారాయణ స్వామి గారు, ఆలయ ప్రధాన అర్చకులు, అధికారులతో కలిసి రథోత్సవానికి ఏర్పాట్లపై సమీక్షించారు.
ఈ రథోత్సవ కార్యక్రమానికి ఆంధ్రతో పాటు, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ నుంచి భారీగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా భద్రతా ఏర్పాట్లు పటిష్టంగా చేపట్టాలని ఆదేశించారు.
రథోత్సవం జరిగే మార్గమంతా ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
జన సందోహాన్ని నియంత్రించడంతో పాటు, ట్రాఫిక్ నిర్వహణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా రథం తిరిగే ప్రాంతాల్లో పోలీసులు అప్రమత్తంగా ఉండి ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో తాగునీటితో పాటు, మెడికల్ సిబ్బందిని అందుబాటులో ఉంచాలన్నారు.
అదేవిధంగా దేవాలయ ప్రాంతంలో సీసీ కెమెరాల పర్యవేక్షణ, డ్రోన్ సర్వైలెన్స్ ద్వారా భద్రతను మరింత బలోపేతం చేయాలని అధికారులకు సూచించారు. మహిళలు, వృద్ధులు, పిల్లలు సురక్షితంగా దర్శనం చేసుకునేలా ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని తెలిపారు.
భక్తులు కూడా పోలీసులకు సహకరించి నియమ నిబంధనలు పాటిస్తూ రథోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎస్పీ గారు కోరారు.
అనంతరం కదిరి టౌన్ మహిళా పోలీస్ స్టేషన్ ని తనిఖీ చేసి మహిళా భద్రతపై పలు సూచనలు చేశారు.
ఈ పరిశీలనలో జిల్లా ఎస్పీ గారితో పాటు, డి.ఎస్.పి శివ నారాయణ స్వామి , ఆలయ ఈవో శ్రీనివాస రెడ్డి, సిఐలు డివి నారాయణ రెడ్డి, నిరంజన్ రెడ్డి, నాగేంద్ర సంబంధిత పోలీస్ అధికారులు మరియు దేవాలయ అధికారులు పాల్గొన్నారు.
పుట్టపర్తి జిల్లా పోలీస్ కార్యాలయం..

