శ్రీ సత్యసాయి జిల్లా కొత్తచెరువు మండలం బండ్లపల్లి గ్రామంలో వెలసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో కదిరి పున్నమి (హోలీ) పండుగ వేడుకలు అత్యంత వేడుకగా జరిగాయి. ఈ పవిత్ర దినాన్ని పురస్కరించుకుని నిర్వహించిన పంజా మరియు దోసంగల ఉత్సవం భక్తుల కోలాహలం మధ్య రంగరంగ వైభవంగా సాగింది. గ్రామస్తులు, చుట్టుపక్కల ప్రాంతాల భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు.
ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన ప్రత్యేక పూజలు, సాంప్రదాయ కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. హోలీ పండుగ పర్వదినాన స్వామివారి ఆశీస్సుల కోసం భక్తులు భక్తిశ్రద్ధలతో ఈ వేడుకల్లో పాల్గొన్నారు. సాయి రామ్.. అందరికీ శుభరాత్రి!

