శ్రీరామ నవమి పర్వదినాన్ని పురస్కరించుకుని జిల్లా ప్రజలందరికీ జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ ఐఏఎస్ గారు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆదర్శ పురుషుడు శ్రీరామచంద్రుని ఆశీస్సులు జిల్లా ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలని, ప్రతి ఇంటా సుఖశాంతులు, సౌభాగ్యాలు విరాజిల్లాలని ఆకాంక్షించారు. ధర్మం, సత్యం, క్రమశిక్షణ వంటి విలువలను ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలని ఆయన కోరారు.

