Editor

AP

రూ. 22వేల కోట్లతో అనంతపురం జిల్లాలో రెన్యూ ఎనర్జీ కాంప్లెక్స్..!

రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ప్రజాప్రభుత్వం ఏర్ప‌డిన త‌ర్వాత‌ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ (ICE)తో పెద్దఎత్తున పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులు ఏపీకి క్యూకడుతున్నాయి. ఇందులో భాగంగా అనంతపురం జిల్లా గుంతకల్లు నియోజకవర్గం బేతపల్లిలో రెన్యూ సంస్థ రూ. 22వేల కోట్లతో భారతదేశంలోనే అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ రెన్యువబుల్ పవర్ కాంప్లెక్స్ ఏర్పాటు చేయనుంది. ఈ నెల 16వ తేదీన రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ ఈ భారీ ప్రాజెక్టుకు శంకుస్థాపన…

AP

కొడాలి నాని నమ్మక ద్రోహి.. వైసీపీ మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు ఖాసిం..!

గుడివాడ మాజీ ఎమ్మెల్యే, వైసీపీ సీనియర్ నేత కొడాలి నానిపై అదే పార్టీకి చెందిన మైనారిటీ సెల్ జిల్లా అధ్యక్షుడు మహ్మద్ ఖాసిం (అబూ) తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. కొడాలి నాని అసమర్థుడని, దశాబ్దాల పాటు గెలిపించిన గుడివాడ ప్రజల నమ్మకాన్ని వమ్ము చేసి, కష్టకాలంలో వారిని వదిలి అజ్ఞాతంలోకి వెళ్లిన నమ్మకద్రోహి అని ఆరోపించారు. ఖాసి వ్యాఖ్యలతో కూడిన ఓ వీడియో కొద్ది రోజులుగా సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారమవుతూ రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది.…

National

దేశ భద్రత కోసం 10 శాటిలైట్లు నిరంతరం పనిచేస్తున్నాయి: ఇస్రో చైర్మన్..

దేశ పౌరుల భద్రత, సురక్షతో పాటు వ్యూహాత్మక ప్రయోజనాల పరిరక్షణ కోసం పది అత్యంత కీలకమైన ఉపగ్రహాలు నిరంతరం నిఘా నేత్రాలుగా పనిచేస్తున్నాయని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ఛైర్మన్ వి. నారాయణన్ వెల్లడించారు. అగర్తలలో ఆదివారం జరిగిన సెంట్రల్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ (సీఏయూ) ఐదవ స్నాతకోత్సవంలో ఆయన ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఉపగ్రహాలు దేశ భద్రతకు కవచంలా నిలుస్తున్నాయని ఆయన నొక్కిచెప్పారు.   “దేశ భద్రతను కాపాడుకోవాలంటే, మనకున్న 7,000 కిలోమీటర్ల…

NationalSPORTS

టెస్ట్ క్రికెట్ కు కోహ్లీ గుడ్ బై..!

టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ కు గుడ్ బై చెప్పారు. తాజాగా రిటైర్ మెంట్ ప్రకటిస్తూ ఇన్‌స్టాలో భావోద్వేగభరిత పోస్ట్‌ చేశారు. భారత్‌ తరఫున కోహ్లీ దాదాపు 14 ఏళ్ల పాటు టెస్టులకు ప్రాతినిధ్యం వహించారు. ఇది తనకెంతో గర్వకారణమని కోహ్లీ చెప్పారు. 2011లో వెస్టిండీస్‌ తో మ్యాచ్ ద్వారా ఆయన టెస్టుల్లో అరంగేట్రం చేశారు. తన కెరీర్‌లో కోహ్లీ 123 టెస్టు మ్యాచ్‌లు ఆడి 30 సెంచరీలు, 31 హాఫ్ సెంచరీలతో…

National

ఆపరేషన్ సిందూర్‌పై ప్రధాని మోదీ ఈ ఐదు లక్ష్యాలను నిర్దేశించారు: సంబిత్ పాత్రా..

పహల్గామ్ ఉగ్రవాద ఘటనకు ప్రతిస్పందనగా భారత సైన్యం చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్‌’ వందకు వంద శాతం విజయవంతమైందని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి సంబిత్ పాత్రా ఉద్ఘాటించారు. ఈ ఆపరేషన్‌‍కు సంబంధించి మోదీ ఐదు లక్ష్యాలను నిర్దేశించారని తెలిపారు. ఢిల్లీలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రధాని నరేంద్ర మోదీ సమర్థవంతమైన నాయకత్వం వల్లే ఇది సాధ్యమైందని ప్రశంసించారు. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం అమల్లో ఉండటంతో సరిహద్దుల్లో ప్రశాంత వాతావరణం…

AP

మే 15 నుంచి వాట్సాప్‌లో రేషన్ కార్డు దరఖాస్తు.!

రాష్ట్రంలో పౌర సరఫరాల సేవలను ప్రజలకు మరింత చేరువ చేసే దిశగా ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. నూతన రైస్ కార్డుల జారీతో పాటు ఇతర ఆరు రకాల అనుబంధ సేవలను అందుబాటులోకి తెచ్చినట్లు రాష్ట్ర ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. ఈ సేవలను ఇప్పటికే 72,519 మంది వినియోగించుకున్నారని, మే 15వ తేదీ నుంచి వాట్సాప్ గవర్నెన్స్ విధానం ద్వారా కూడా ఇంటి వద్ద నుంచే దరఖాస్తు చేసుకునే వెసులుబాటు…

AP

క‌రెంట్‌ ఛార్జీల పెంపుపై మంత్రి గొట్టిపాటి ర‌వి కుమార్ కీల‌క ప్ర‌క‌ట‌న‌..

ఏపీలో క‌రెంట్ ఛార్జీలు పెంచుతున్న‌ట్లు గ‌త కొన్ని రోజులుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. దీంతో గృహ వినియోగ‌దారులు ఆందోళ‌న చెందుతున్న విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికే ఇళ్ల‌కు వ‌స్తున్న కరెంట్ బిల్లులు భ‌య‌పెడుతున్నాయ‌ని, మ‌రోసారి ధ‌ర‌లు పెంచితే ఎలాగంటూ వారు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. ఈ క్ర‌మంలో తాజాగా మంత్రి గొట్టిపాటి ర‌వి కుమార్ విద్యుత్ ఛార్జీలు పెంచుతున్న‌ట్లు జ‌రుగుతున్న ప్ర‌చారంపై స్పందించారు.   ఈ మేర‌కు ఆయ‌న క‌రెంట్ ఛార్జీల పెంపుపై కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. ఎట్టిప‌రిస్థితుల్లో విద్యుత్…

National

సరిహద్దుల వైపు కదులుతున్న పాక్ సైన్యం..!

భారత్ పాక్ ల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలను పాకిస్థాన్ మరింత పెంచుతోందని ఆర్మీ ప్రతినిధి కల్నల్ సోఫియా ఖురేషీ మీడియాకు వెల్లడించారు. ఆపరేషన్ సిందూర్ పై శనివారం ఉదయం ఆర్మీ మీడియా సమావేశం ఏర్పాటు చేసింది. పాకిస్థాన్ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని తిప్పికొడుతూ వాస్తవాలను మీడియా ముందు పెట్టింది. ఈ సమావేశంలో విదేశాంగ శాఖ ప్రతినిధి విక్రమ్ మిస్రీ, సైన్యానికి చెందిన కల్నల్ సోఫియా ఖురేషీ, వాయుసేనకు చెందిన వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ పాల్గొన్నారు. ఈ…

TELANGANA

ఆరు నెలలు కాల్పుల విరమణ.. మావోయిస్టు పార్టీ సంచలన నిర్ణయం..!

తెలంగాణ – ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లోని కర్రెగుట్టల్లో భద్రతా బలగాలు.. కూంబింగ్ ముమ్మరం చేసిన వేళ.. మావోయిస్టు పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. ఆరు నెలల పాటు కాల్పులు విరమిస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు గురువారం సాయంత్రం మావోయిస్టు పార్టీ అగ్రనేత జగన్ పేరిట లేఖ విడుదలైంది.   ‘‘తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు, ప్రజాస్వామికవాదులు, ప్రజా సంఘాలు, మెజార్టీ రాజకీయ పార్టీలు మావోయిస్ట్ పార్టీకి, ప్రభుత్వానికి నడుమ శాంతి చర్చలు జరగాలనే డిమాండ్‌ను ప్రముఖంగా చేస్తున్నారు. దీనిని దృష్టిలో…

TELANGANA

ఆపరేషన్ సిందూర్.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం..!

ఏప్రిల్ 22, పహల్గాం ఉగ్రదాడి తర్వాత జాగ్రత్తగా గమనిస్తే.. ఇద్దరు రాజకీయ నేతలు మిగతా వారందరి కంటే ప్రత్యేకంగా నిలుస్తున్నారు. ఆ ఇద్దరు మన తెలుగు నాయకులే కావడం గర్వకారణం. ఒకరు తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి, మరొకరు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. టెర్రర్ అటాక్‌ బాధితులకు నివాళిగా పార్టీ తరఫున 3 రోజులు సంతాప దినాలను నిర్వహించారు జనసేనాని. బాధిత తెలుగు కుటుంబాలను పరామర్శించి ఓదార్చారు. పార్టీ తరఫున 50 లక్షల పరిహారం అందించారు.…